సీఎం జగన్ ఇంట విషాదం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీ సీఎం జగన్‌ ఇంట విషాదం అలుముకుంది. జగన్ పెద్దమామ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. గంగిరెడ్డి.. జగన్ సతీమణి వైఎస్‌ భారతిరెడ్డికి పెద్దనాన్న అవుతారు. గంగిరెడ్డి వయసు 78 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పెద్ద గంగిరెడ్డి.. పులివెందులలోని ఓ ఆసుపత్రిలో కొద్దిరోజులు చికిత్స పొందారు. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవలే స్వగ్రామం వేముల మండలం గొల్లలగూడూరులోని తన ఇంటికి చేరుకున్నారు.

ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి వచ్చాక మరోసారి గంగిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. శనివారం(సెప్టెంబర్ 5,2020) ఉదయం 5 గంటల సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. చికిత్స కోసం ఆయనను పులివెందులకు తరలిస్తుండగా, మార్గం మధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో పెద్ద గంగిరెడ్డి భౌతికకాయాన్ని గొల్లలగూడూరు గ్రామానికి తీసుకొచ్చారు. విషయం తెలిసిన వెంటనే సీఎం జగన్‌, కుటుంబసభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు.

జగన్ తల్లి విజయమ్మ, అలాగే సీఎం సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి గొల్లల గూడూరు గ్రామానికి చేరుకున్నారు. గంగిరెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు.

Related Posts