లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

పెరిగిన రైల్వే చార్జీలు.. నేటి నుంచి అమల్లోకి

Published

on

Train tickets to become costly from today as Indian Railways hike base price

దేశవ్యాప్తంగా నేటి(01 జనవరి 2020) నుంచి రైల్వే ఛార్జీలు పెంచింది రైల్వేశాఖ. కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్న వేళ.. వివిధ ప్యాసింజర్‌ రైళ్లకు కిలోమీటరుకు కనీసం 4 పైసలు పెంచుతున్నట్లు రైల్వేశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ ప్రకటన చేశారు. ఈ పెంపు 2020 జనవరి 1న ప్రారంభమైన మరుక్షణం నుంచే అమల్లోకి వచ్చింది. సాధారణ నాన్‌ ఏసీ రైళ్లకు ఈ చార్జీలు కిలోమీటరకు ఒక పైసా పెరగనుండగా.. నాన్‌ ఏసీ మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు కిలోమీటరుకు 2 పైసల చొప్పున పెరుగుతున్నాయి.

ఇవాళ నుంచి ఏసీ తరగతులకు కిలోమీటరుకు 4 పైసల చొప్పున పెరుగుతున్నట్లు రైల్వే వర్గాలు ప్రకటనలో తెలిపాయి. సబర్బన్‌ రైళ్లు మినహా రాజధాని, శతాబ్ది, దురంతో, వందేభారత్‌, తేజస్‌, హమ్‌ సఫర్‌, మహామన, గతిమాన్‌, గరీబ్‌రథ్‌, అంత్యోదయ, జనశతాబ్ది తదితర రైళ్లన్నింటికీ ఈ చార్జీల పెంపు వర్తిస్తుంది.

అయితే జనవరి 1కి కన్నా ముందు బుక్‌ చేసుకున్న టికెట్లకు ఈ పెంపు వర్తించదు. దీంతోపాటు రిజర్వేషన్‌ ఫీజు, సూపర్‌ఫాస్ట్‌ చార్జీల్లో కూడా ఎటువంటి మార్పు ఉండబోదు. రైల్వే చార్జీలను 2014-15లో సవరించగా, నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ వెల్లడించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *