PM Modi releases the 8 cheetahs: కునో నేషనల్ పార్కులోకి చీతాలను విడిచిపెట్టిన ప్రధాని మోదీ.. వీడియో

నమీబియా నుంచి తీసుకువచ్చిన ఐదు ఆడ, మూడు మగ చీతాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్, కునో నేషనల్ పార్కులోకి విడిచిపెట్టారు. క్వారంటైన్ ఎన్ క్లోజర్లలోకి అవి వెళ్లాయి. దాదాపు 70 ఏళ్ల తర్వాత చీతాలు మళ్లీ భారతావనిపై నడిచాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ లా మారి, వాటి ఫొటోలు తీయడం గమనార్హం.

PM Modi releases the 8 cheetahs: కునో నేషనల్ పార్కులోకి చీతాలను విడిచిపెట్టిన ప్రధాని మోదీ.. వీడియో

PM Modi releases the 8 cheetahs: నమీబియా నుంచి తీసుకువచ్చిన ఐదు ఆడ, మూడు మగ చీతాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్, కునో నేషనల్ పార్కులోకి విడిచిపెట్టారు. క్వారంటైన్ ఎన్ క్లోజర్లలోకి అవి వెళ్లాయి. దాదాపు 70 ఏళ్ల తర్వాత చీతాలు మళ్లీ భారతావనిపై నడిచాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ లా మారి, వాటి ఫొటోలు తీయడం గమనార్హం.

నమీబియాలోని విండ్‌హోక్‌ విమానాశ్రయం నుంచి బీ747 జంబో జెట్‌ విమానంలో నిన్న రాత్రి బయలుదేరిన ఎనిమిది చీతాలు గ్వాలియర్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు ఇవాళ ఉదయం చేరుకున్ విషయం తెలిసిందే. అక్కడ వాటికి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలికారు. హెలికాప్టర్లలో ఆ ఎనిమిది చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కుకు తరలించారు. ఆ చీతాల వయసు నాలుగు-ఆరేళ్ల మధ్య ఉంటుంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కునో నేషనల్ పార్కుకు చేరుకుని వాటిని ఎన్ క్లోజర్లలోకి విడిచిపెట్టారు. ఆ చీతాల జాతిని భారత్‌లో పునఃప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రాజెక్ట్‌ చీతా’ చేపట్టింది. ఈ ప్రాజెక్టును మొదట సుప్రీంకోర్టు నిలిపివేసినప్పటికీ, 2020 జనవరిలో మళ్ళీ ఆమోద ముద్ర వేసింది. చీతాల సంరక్షణ విషయంలో ఈ ఏడాది జూలై 20న నమీబియాతో భారత్‌ ఒప్పందం చేసుకుంది. దీంతో ఆ చీతాలు భారత్ కు చేరాయి.

India’s Active caseload: దేశంలో కొత్తగా 5,747 మందికి కరోనా.. ప్రస్తుతం 46,848 యాక్టివ్ కేసులు