Man Bike Stunt Video: బైకుకు ఒకవైపే కూర్చొని దాన్ని ఒక్క చేత్తో నడిపిస్తూ నడి రోడ్డుపై యువకుడి విన్యాసాలు.. చివరకు

బైకుకు ఒకవైపే కూర్చొని దాన్ని ఒక్క చేత్తో నడిపిస్తూ నడి రోడ్డుపై విన్యాసాలు చేశాడు ఓ యువకుడు. రద్దీగా ఉన్న రోడ్డుపై అతడు బైకు హ్యాండిల్ ను ఒకే చేత్తో పట్టుకుని ప్రమాదకరంగా దాన్ని నడిపించాడు. అంతేగాక, తాను ఆ పని చేస్తుండగా తన స్నేహితుడితో వీడియో తీయించుకున్నాడు. చివరకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Man Bike Stunt Video: బైకుకు ఒకవైపే కూర్చొని దాన్ని ఒక్క చేత్తో నడిపిస్తూ నడి రోడ్డుపై యువకుడి విన్యాసాలు.. చివరకు

Man Bike Stunt Video

Man Enjoys Bike Stunt: బైకుకు ఒకవైపే కూర్చొని దాన్ని ఒక్క చేత్తో నడిపిస్తూ నడి రోడ్డుపై విన్యాసాలు చేశాడు ఓ యువకుడు. రద్దీగా ఉన్న రోడ్డుపై అతడు బైకు హ్యాండిల్ ను ఒకే చేత్తో పట్టుకుని ప్రమాదకరంగా దాన్ని నడిపించాడు. అంతేగాక, తాను ఆ పని చేస్తుండగా తన స్నేహితుడితో వీడియో తీయించుకున్నాడు. చివరకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అతడిని రూ.4,200 జరిమానా విధించి చర్యలు తీసుకున్నారు. తనను క్షమించాలని చెవులు పట్టుకుని ఆ యువకుడు వేడుకున్నాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ లోని దుర్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ యువకుడు బైకు నడిపిన వీడియోను, తనను క్షమించాలని వేడుకున్న దృశ్యాలను అక్కడి పోలీసులు తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ట్రాఫిక్ రూల్స్ పాటించాలని లేదంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీసులు ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఇది బాగా వైరల్ అయింది. పోలీసులు అతడికి బుద్ధి చెప్పిన తీరును నెటిజన్లు కొనియాడారు.

K.Chandrashekar Rao wishes: టీమిండియాకు తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు