Video Of Girl Dancing Inside Metro Coach: మెట్రో రైలులో రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన అమ్మాయి.. వీడియో వైరల్

ఓ అమ్మాయి ఢిల్లీ మెట్రో ట్రైన్ లో ప్రయాణికులందరి ముందూ డ్యాన్స్ చేసి వీడియో తీసుకుంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. తిన్లే భూటియా అనే ఓ ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ ‘‘ఆత్మవిశ్వాసం అంటే ఇలా ఉంటుంది’’ అని పేర్కొనడం గమనార్హం. తెల్లదుస్తులు వేసుకున్న ఓ అమ్మాయి మెట్రో కోచ్ లో డ్యాన్స్ చేస్తుండగా ఆమె స్నేహితురాలు ఈ వీడియో తీసింది.

Video Of Girl Dancing Inside Metro Coach: మెట్రో రైలులో రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన అమ్మాయి.. వీడియో వైరల్

Video Of Girl Dancing Inside Metro Coach: సామాజిక మాధ్యమాల్లో అమ్మాయిలు, అబ్బాయిలు వీడియోలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా స్టార్లుగా ఎదగాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు తమ వీడియోలు వైరల్ కావడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఎక్కడపడితే అక్కడ డ్యాన్సులు చేస్తూ చాలా మందికి ఇబ్బంది కలిగిస్తుంటారు. హైదరాబాద్ మెట్రోలో ఇటీవల ఓ అమ్మాయి డ్యాన్స్ చేయడంతో దీనిపై మెట్రో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి, ఇటువంటి పనులు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇటువంటి ఘటనే ఢిల్లీ మెట్రో రైలులోనూ తాజాగా చోటు చేసుకుంది.

ఓ అమ్మాయి ఢిల్లీ మెట్రో ట్రైన్ లో ప్రయాణికులందరి ముందూ డ్యాన్స్ చేసి వీడియో తీసుకుంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. తిన్లే భూటియా అనే ఓ ఇన్ స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ ‘‘ఆత్మవిశ్వాసం అంటే ఇలా ఉంటుంది’’ అని పేర్కొనడం గమనార్హం. తెల్లదుస్తులు వేసుకున్న ఓ అమ్మాయి మెట్రో కోచ్ లో డ్యాన్స్ చేస్తుండగా ఆమె స్నేహితురాలు ఈ వీడియో తీసింది. మెట్రో రైలులో డ్యాన్స్ చేసిన ఆ అమ్మాయిపై కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే, కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ghamba Bhumo (@thinlay.bhutia)