Viral Video: ట్రక్కులో టమాటాలు వేయడానికి ఇతడు పాటిస్తున్న ట్రిక్ అదుర్స్

ఓ వ్యక్తి బుట్టను గాల్లోకి విసిరేస్తే అందులోని టమాటాలు ట్రక్కులో పడి, ఖాళీ బుట్ట దానంతట అదే వెనక్కు వచ్చి కిందపడిపోతుంది. దీంతో వేగవంతంగా ట్రక్కులో టమాటాలు వేసే అవకాశం ఉంటుంది. ‘అర్నాల్డ్ పవర్... ఐన్‌స్టీన్ మెదడు’’ ఇతడికి ఉందంటూ ఆ వ్యక్తిని నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

Viral Video: ట్రక్కులో టమాటాలు వేయడానికి ఇతడు పాటిస్తున్న ట్రిక్ అదుర్స్

Viral Video: ఓ ట్రక్కులో టమాటాలు వేసే క్రమంలో ఓ వ్యక్తి పాటిస్తున్న ట్రిక్ అశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సాగర్ అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేయగా దీన్ని కోటి మందికి పైగా చూశారు. సాధారణంగా టమాటాలను ట్రక్కులో వేయడానికి చాలా మంది ఎంతో కష్టపడి పోతుంటారు.

బుట్టలో టమాటాలు వేసుకుని దాన్ని జాగ్రత్తగా లేపి ట్రక్కులో టమాటాలు వేసి, మళ్ళీ ఖాళీ బుట్టను కింద పెట్టాల్సి ఉంటుంది. ఓ వ్యక్తి మాత్రం బుట్టను గాల్లోకి విసిరేస్తే అందులోని టమాటాలు ట్రక్కులో పడి, ఖాళీ బుట్ట దానంతట అదే వెనక్కు వచ్చి కిందపడిపోతుంది. దీంతో వేగవంతంగా ట్రక్కులో టమాటాలు వేసే అవకాశం ఉంటుంది.

‘అర్నాల్డ్ పవర్… ఐన్‌స్టీన్ మెదడు’’ ఇతడికి ఉందంటూ ఆ వ్యక్తిని నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. సినిమాల్లో రజనీకాంత్ మాత్రమే ఇలా చేస్తాడని, నిజ జీవితంలో ఈ వ్యక్తి రజనీకాంత్ ను మించిపోయాడని కొందరు కామెంట్లు చేశారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..