కోవిడ్ వ్యాక్సిన్ ఒక్క డోసు సరిపోదా? ప్రతియేడూ, జీవితాంతం వేసుకోవాల్సిందేనా?

10TV Telugu News

COVID vaccine: కోవిడ్ వ్యాక్సిన్ పరిశోధకులు, తయారీదారులకు ఒక డౌట్? వ్యాక్సిన్ వల్ల వచ్చిన ఇమ్యునిటీని యేడాది తర్వత శరీరం పోగొట్టుకుంటే? ఏం చేయాలి?

ఒక్కడోసు వేస్తే మనకి జీవితంలో కరోనా రాబోదన్న గ్యారంటీ లేదు. అసలు coronavirus immunity ఏళ్ల కొద్దీ ఏం ఉండదు. మహా ఐతే యేడాది. అందుకే వ్యాక్సిన్ తయారీదారుల్లో కలకలం. కరోనా నుంచి వ్యాక్సిన్ ఇమ్యునిటీ మనల్ని కాపాడలగలదు?

ఇప్పుడున్న రీసెర్చ్ ఫలితాల ప్రకారం వ్యాక్సిన్ ఇమ్యునిటీ నాలుగు నెలల నుంచి 12నెలల వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత కరోనా సోకితే? ఈ మాట వినడానికి గుండు గుబేల్ మంటోంది.

కోవిడ్ 19 మనకు కొత్త. ఆరునెలల డేటాను బట్టి ఇమ్యునిటీ ఎంతకాలం ఉంటోందో చెప్పడం అసాధ్యం. కాకపోతే, ఒకసారి కరోనా సోకిన వ్యక్తికి యాంటీబాడీలు కనీసం మూడునెలలు పాటు ఉంటాయి. అంటే అప్పటిదాకా మరోసారి కరోనా రాదు.

అంతర్జాతీయంగా ఒక ఆందోళన సోషల్ మీడియాలో కనిపిస్తోంది మూడునెలల క్రితం కరోనా సోకిన వ్యక్తికి వచ్చే రెండుమూడు నెలల్లో మళ్లీ కరోనా సోకే అవకాశం ఉందంట. అంటే సెకండ్ వేవ్‌కి వాళ్లు బలవుతారా?

వ్యాక్సిన్ ఇమ్యునిటీ ఎంతకాలం?

scientific journal Nature Medicineలో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం, కరోనా సోకిన వ్యక్తికి 12నెలలు పాటు ఇమ్యునిటీ డవలప్ అవుతుంది. ఇదికూడా నాలుగు విభిన్నమైన seasonal coronaviruses స్టడీల‌బట్టి చెప్పిందే. .

కరోనా వల్ల వచ్చే ఇమ్యునిటీ మూడునెలలు, కాదు 12నెలలు. మరో మూడునెలలు అనుకోండి. అయినా సరే, యాంటీబాడీల వల్ల వచ్చే రోగనిరోధక శక్తి తాత్కాలికం. దీన్నే Transient immunity అంటున్నారు.

ఈలెక్కన కరోనా వ్యక్సిన్ వచ్చిందని సంబరపడక్కర్లేదు. వ్యాక్సిన్ వేసుకొంటే మనకు మహాఐతే యేడాది రక్షణ. ఆ తర్వాత? వైరస్‌కు దూరంగా ఉండటం, వీలైతే మళ్లీ వ్యాక్సిన్ వేసుకోవడం.

వ్యాక్సిన్ త్వరలో వచ్చినా, అది నూటికి నూరుశాతం పనిచేస్తుందని, ఎక్కువకాలం ప్రొటెక్షన్ ఇస్తుందని అనుకోలేం. కరోనాను తరిమికొట్టాలంటే ఏం చేయాలి? టెస్టింగ్ చేయాలి. కంటైన్మెంట్ జోన్లను ఎర్పాటుచేసి, మిగిలిన ప్రాంతాలు వైరస్ నుంచి కాపాడాలి. అదొక్కటే మార్గమంటున్నారు వైద్యనిపుణులు.

×