Abandoned house : ఆ పాడుబడిన ఇంట్లో 1000 కి పైగా బొమ్మలు.. లోనికి వెళ్లాలంటే భయం..భయం.. ఆ ఇంట్లో ఏముంది?

ఓ తల్లి.. ఇద్దరు పిల్లలు.. ఏం జరిగిందో ఇద్దరు పిల్లలు చనిపోయారు. అప్పటి నుంచి ఆ తల్లి ఇంటిని మొత్తం బొమ్మలతో నింపేసింది. జీవితం మొత్తం ఏకాంతంగా గడిపింది. ఆమె కూడా చనిపోయాక ఇల్లు పాడుబడిపోయింది. ఆ ఇంట్లోకి వెళ్లడానికి జనం సాహసించరు. ఆ పాడుబడిన ఇల్లు ఎక్కడ ఉంది అంటే.,?

Abandoned house : ఆ పాడుబడిన ఇంట్లో 1000 కి పైగా బొమ్మలు.. లోనికి వెళ్లాలంటే భయం..భయం.. ఆ ఇంట్లో ఏముంది?

Abandoned house

Abandoned house : పిల్లలకి బొమ్మలుంటే చాలు.. కానీ పిల్లలే లేని ఓ పాడుబడిన ఇంట్లో 1000 కి పైగా బొమ్మలు. స్పెయిన్‌లోని సెవిల్లే శివార్లలో ఉన్న ఆ ఇంట్లో ఎందుకు అన్ని బొమ్మలు ఉన్నాయి? ఏమిటా కథ?

 

స్పెయిన్‌లోని సెవిల్లే శివార్లలో ఓ పాడుబడిన ఇంట్లో ఎక్కడ చూసినా బొమ్మలే కనిపిస్తాయి. ఇద్దరు పిల్లల్ని కోల్పోయిన ఓ తల్లి విషాద కథను చెబుతాయి. 2017 వరకూ ఆ ఇంట్లో నివాసం ఉన్న మహిళ ఇంటి నిండా బొమ్మలతో నింపేసింది.

 

తన ఇద్దరు పిల్లల్ని కోల్పోయిన తరువాత ఆమె ఇలా చేయడం మొదలు పెట్టిందట. కేంబ్రిడ్జ్‌కు చెందిన అన్వేషకుడు బెన్ జేమ్స్ ఆ ఇంటిని సందర్శించినపుడు ఈ ఫోటోలను తీశారు. బయట చూడటానికి పాడుబడిన ఇంటిలా అనిపించినా లోపల ఇంటీరియర్ చక్కగా ఉందట.

strange creature : అమరిల్లో సిటీలో వింత ఆకారం.. అంతుచిక్కని మిస్టరీ..

జేమ్స్ ఆ ఇంటి గురించి ఇంట్లో బొమ్మల గురించి చుట్టుపక్కల వారి నుంచి సమాచారం సేకరించారు. ఆ ప్రాంతంలో వారందరికీ ఆ ఇంట్లో ఉన్న మహిళ తెలుసు. కానీ ఎప్పుడు ఆ ఇంట్లోకి వెళ్లడానికి ధైర్యం చేసేవారు కాదట. ఆ మహిళ కూడా లోనికి రావడానికి ఎవరికీ అనుమతి ఇచ్చేది కాదట. ఒంటరిగా ఉంటూ బొమ్మలను కొనుగోలు చేస్తూ ఇంటినిండా వాటిని నింపేసేదట. 2017లో ఆమె చనిపోయినప్పటికీ శపించబడిన ఇల్లుగా ఇప్పటికీ ఆ ఇంట్లోకి ఎవరూ వెళ్లరట.

SPY Movie: సుభాష్ చంద్రబోస్ మిస్టరీని బయటపెట్టేందుకు రెడీ అయిన స్పై

ఆ ఇంట్లో ఎటు చూసినా గోడలు, బెడ్‌లు, టేబుట్స్, వార్డ్‌ రోబ్ లు, షోకేసుల మీద బొమ్మలు కనిపిస్తాయి. జేమ్స్ తన జీవితంలో చూసిన అద్భుతమైన ప్రదేశాలలో ఇది ఒకటి అని చెప్పాడు. అతను పగటిపూట ఈ ఇంట్లోకి వెళ్లాడట. తల్లి, ఇద్దరు పిల్లల మరణం అందమైన బంగ్లాలో బొమ్మల సాక్షిగా విషాద గాథగా మిగిలిపోయింది.

 

View this post on Instagram

 

A post shared by Ben James (@places_forgotten)