Bizarre Rules: ఓ కేఫ్ ముందు కస్టమర్లకు విచిత్ర నిబంధనలు విధిస్తూ రాతలు.. చదివాక దిమ్మతిరిగిపోయిందంటున్న నెటిజన్లు

ఈ కేఫ్ ముందు వెరైటీగా సూచనలు చేశారు. ‘‘పొగ తాగరాదు.. పొగతాగే కుక్కలు లోపలికి రావద్దు’’ అని పేర్కొన్నారు. అంతేగాక, ‘‘ఇక్కడ సీసీటీవీ ఉంది. నీ అమ్మ ఇక్కడ ఉంటే ఎలా ఉంటారో అలాగే ఉండండి’’ అని రాసుకొచ్చారు. ఈ నిబంధనలు అన్నీ పాటించేవారే కేఫ్ లోకి రావాలని చెప్పారు. అయితే, ఆ కేఫ్ నిర్వాహకులు ఇలా నిబంధనలు అంటూ ఏం రాశారో, ఎందుకు రాశారో అర్థం కావట్లేదని నెటిజన్లు వాపోతున్నారు.

Bizarre Rules: ఓ కేఫ్ ముందు కస్టమర్లకు విచిత్ర నిబంధనలు విధిస్తూ రాతలు.. చదివాక దిమ్మతిరిగిపోయిందంటున్న నెటిజన్లు

Bizarre Rules

Bizarre Rules:  ఓ కేఫ్ ముందు వినియోగదారులకు పలు నిబంధనలు విధిస్తూ సూచనలు చేశారు. అయితే, ఇందులో అక్షరాలు తప్పుగా రాయడంతో అర్థాలు మారిపోవడం నవ్వులు పూయిస్తోంది. అలాగే, ఆ కేఫ్ నిర్వాహకులు చేసిన కొన్ని సూచనలు వింతగానూ ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణంగా అనేక దుకాణాల వద్ద పొగ తాగరాదు, పెంపుడు జంతువులను లోపలికి తీసుకురావద్దు అని సూచిస్తుంటారు.

అయితే, ఈ కేఫ్ ముందు వెరైటీగా సూచనలు చేశారు. ‘‘పొగ తాగరాదు.. పొగతాగే కుక్కలు లోపలికి రావద్దు’’ అని పేర్కొన్నారు. అంతేగాక, ‘‘ఇక్కడ సీసీటీవీ ఉంది. నీ అమ్మ ఇక్కడ ఉంటే ఎలా ఉంటారో అలాగే ఉండండి’’ అని రాసుకొచ్చారు. ఈ నిబంధనలు అన్నీ పాటించేవారే కేఫ్ లోకి రావాలని చెప్పారు. అయితే, ఆ కేఫ్ నిర్వాహకులు ఇలా నిబంధనలు అంటూ ఏం రాశారో, ఎందుకు రాశారో అర్థం కావట్లేదని నెటిజన్లు వాపోతున్నారు.

ఈ నిబంధనలు చదివిన వారు తికమక పడక తప్పదని పేర్కొంటున్నారు. కేఫ్ నిర్వాహకులు రాసింది చదివాక దిమ్మతిరిగిపోయిందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. ఈ నిబంధనలను దక్షిణ లండన్ లోని కోస్టా కాఫీ సెంటర్ వద్ద రాసుకొచ్చారు. ‘పొగతాగే కుక్కలు’ అని రాయడం ఏంటీ? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంతకు ముందు ఈ కేఫ్ లోకి కుక్కలు వచ్చి పొగతాగి వెళ్లాయా? అందుకే మరోసారి కుక్కలు రాకుండా ఇలా రాశారా? అని మరొకరు పేర్కొన్నారు.

COVID-19: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 3,230 మందికి కొవిడ్