Assom Govt Aginst Child Marriage : బాలికలతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటే భర్తల్ని అరెస్ట్ చేస్తాం : సీఎం వార్నింగ్

18 ఏళ్లలోపు అమ్మాయిలను వివాహం చేసుకుంటే అరెస్టులు తప్పవని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ హెచ్చరించారు. బాలికలతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటే భర్తల్ని అరెస్ట్ చేస్తాం అని సీఎం వార్నింగ్ ఇచ్చారు.

Assom Govt Aginst Child Marriage : 18 ఏళ్లలోపు అమ్మాయిలను వివాహం చేసుకుంటే అరెస్టులు తప్పవని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ హెచ్చరించారు. 18 ఏళ్లలోపు వారిని వివాహం చేసుకుంటే అది బాల్య వివాహం లెక్కకిందకొస్తుందని అటువంటివారిని అరెస్ట్ చేస్తామని అలా బాల్య వివాహాలు చేసుకున్న ఏడుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు. బాల్యవివాహాలపై సీఎం దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన తరువాత అసోం రాష్ట్ర వ్యాప్తంగా 4,004 బాల్య వివాహాల కేసులు నమోదు అయ్యాయి. నాగావ్, మోరిగావ్ జిల్లాల్లో బాల్యవివాహాలు చేసుకున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.వీరిలో ఐదుగురు నాగావ్ జిల్లాకు చెందినవారే. జిల్లాలోని బటాద్రబా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరుగుతున్న బాల్య వివాహాలను అడ్డుకుని ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.

‘బాల్యవివాహాలు చేసుకున్న వారిపై శుక్రవారం (ఫిబ్రవరి3,2023) చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’’ అని సీఎం హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేస్తూ పోలీసుల నివేదికను పంచుకున్నారు. బాల్య వివాహాలపై రాష్ట్ర వ్యాప్త పోలీసు చర్యలకు ముందు సీఎం ఉన్నత స్థాయి పోలీసు అధికారుల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో పరిస్థితులను తెలుసుకుని ఇక నుంచి రాష్ట్రంలో బాల్య వివాహాలు జరగటానికి వీల్లేదని ఈ దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

రాష్ట్రంలో బాల్యవివాహాల జరకుండా ఉండటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో ప్రజలు సహకరించాలని సీఎం శర్మ విజ్ఞప్తి చేశారు. పోలీసులు నివేదిక ప్రకారం..ధుబ్రి జిల్లాలో అత్యధికంగా 370 బాల్యవివాహాల కేసులు నమోదు అయి మొదటిస్థానంలో ఉండగా 255కేసులు నమోదుతో హోజాయ్ జిల్లాలో ఉంది. అలాగే ఉదల్గురి జిల్లాలో 235కేసులు, గౌహతి పోలీస్ కమిషనరేట్‌లో 192 కేసులు నమోదయ్యాయి. తగిన వయస్సులోనే గర్భం దాల్చాలని లేకుంటే అది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కాబట్టి బాలికలు చదువుకోవాలని సూచించారు.

అసోం ప్రభుత్వం బాల్య వివాహాలపై ఉక్కుపాదం మోపటమే కాదు 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం నేరమని సీఎం చెప్పారు. రాబోయే ఆరు నెలల్లో బాల్యవివాహాలు చేసుకున్న వేలాది మంది భర్తలను అరెస్టు చేస్తామని సీఎం శర్మ హెచ్చరించారు. బాల్యవివాహాలు,బాలికలపై లైంగిక నేరాల నిరోధానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని సీఎం పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండకుండానే బాలికలు గర్భం దాల్చడానికి కారణమైన భర్తలందరిపై పోక్సో చట్టం కింద కేసులు పెట్టాలని ఆదేశించారు. మహిళల వివాహానికి చట్టబద్ధమైన వయస్సు 18 సంవత్సరాలని, చిన్న అమ్మాయిలను వివాహం చేసుకునే వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు చట్టం తీసుకొస్తామని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు