Anand Mahindra: అత్యంత సంపన్నుల జాబితాలో నం.1 ఎప్పుడు అవుతావన్న నెటిజన్?.. ఆనంద్ మహీంద్ర రిప్లై

‘‘భారతదేశ అత్యంత సంపన్నుల జాబితాలో మీ పేరు 73వ స్థానంలో ఉంది. అగ్రస్థానానికి ఎప్పుడు చేరుకుంటారు?’’ అని నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి ఆనంద్ మహీంద్ర సమాధానం చెబుతూ... ‘‘నిజానికి నేను ఎప్పటికీ అత్యంత సంపన్నుడిని కాలేను. ఎందుకంటే, అది నా ఆశయం కాదు’’ అని రిప్లై ఇచ్చారు.

Anand Mahindra: అత్యంత సంపన్నుల జాబితాలో నం.1 ఎప్పుడు అవుతావన్న నెటిజన్?.. ఆనంద్ మహీంద్ర రిప్లై

Anand Mahindra

Anand Mahindra: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంంద్ మహీంద్ర సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటారు. దేశ ప్రజల్లోని టాలెంట్ ను మెచ్చుకుంటూ ఆయన పోస్ట్ చేసే వీడియోలు వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన అప్పుడప్పుడు సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా, ఆనంద్ మహీంద్రను విక్రాంత్ సింగ్ అనే ఓ నెటిజన్ ఆసక్తికర ప్రశ్న అడిగాడు.

‘‘భారతదేశ అత్యంత సంపన్నుల జాబితాలో మీ పేరు 73వ స్థానంలో ఉంది. అగ్రస్థానానికి ఎప్పుడు చేరుకుంటారు?’’ అని నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి ఆనంద్ మహీంద్ర సమాధానం చెబుతూ… ‘‘నిజానికి నేను ఎప్పటికీ అత్యంత సంపన్నుడిని కాలేను. ఎందుకంటే, అది నా ఆశయం కాదు’’ అని రిప్లై ఇచ్చారు.

ఆనంద్ మహీంద్ర ఇచ్చిన జవాబు అందరినీ ఆకట్టుకుంటోంది. సాధారణంగా చాలా మంది పారిశ్రామిక వేత్తలు దేశంలో, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిని కావాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

ఆనంద్ మహీంద్ర ఇచ్చిన సమాధానం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఆయన ఇచ్చిన సమాధానంపై ఓ నెటిజన్ స్పందిస్తూ… ‘‘గొప్పవారు దేశం గురించి, దాని అభివృద్ధికి తమ సహకారం గురించి మాత్రమే ఆలోచిస్తారు. అంతేగానీ, అత్యంత సంపన్నుడిని కావాలని కాదు’’ అని పేర్కొన్నాడు.

#JanaSenaTelangana: తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధం… పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కసరత్తులు షురూ