Face Book: ఫేస్‌బుక్‌కు మరో షాక్.. ఆదాయంపై భారీ ఎఫెక్ట్??

ఫేస్‌బుక్ ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇటీవల 7 గంటల పాటు ఫేస్‌బుక్, ఇన్ స్టా, వాట్సాప్ సేవలు ఆగిన దెబ్బ నుంచి కోలుకోకముందే.. రష్యా నుంచి మరో షాక్ ఎదురయ్యే ముప్పును ఎదుర్కొంటోంది.

Face Book: ఫేస్‌బుక్‌కు మరో షాక్.. ఆదాయంపై భారీ ఎఫెక్ట్??

Facebook

ఫేస్‌బుక్‌కు కాలం కలిసి రావడం లేదు. ఈ మధ్యే.. సర్వర్ల సమస్యతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7 గంటలపాటు ఫేస్‌బుక్ మాత్రమే కాదు.. వాట్సాప్, ఇన్‌స్టా సేవలు సైతం ఆగిపోయాయి. వాటిని రీస్టోర్ చేసేందుకు సంస్థ నానా తంటాలు పడింది. ఆ దెబ్బ నుంచి కోలుకునేందుకు ఫేస్‌బుక్ ప్రయత్నిస్తుండగానే.. సంస్థకు రష్యా నుంచి మరో షాక్ తగిలింది.

తమదేశానికి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ ను తొలగించాలని.. ఇప్పటికే ఫేస్‌బుక్‌కు రష్యా ఆదేశాలు జారీ చేసింది. సరైన సమయంలో ఆ కంటెంట్ ను తీసేయని కారణంగా.. కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆ దేశ ప్రభుత్వం హెచ్చరించింది. తమ దేశం నుంచి ఫేస్‌బుక్‌ పొందుతున్న వార్షిక టర్నోవర్ లో 10 శాతం జరిమానా తప్పదని తేల్చి చెప్పింది.

Also Read: ఫేస్‌బుక్ కష్టాలు.. జుకర్​బర్గ్‏కు వేలకోట్ల నష్టం

‘మా దేశానికి వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో 1,043 కంటెంట్లు ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ లో 973 కంటెంట్‌లు గుర్తించాం. వాటిని ఫేస్‌బుక్ ఇప్పటికీ డిలిట్ చేయలేదు. అలాగే ఛైల్డ్ పోర్నోగ్రఫీ, డ్రగ్స్ వంటి విషయాల కంటెంట్ లో మా దేశ నిబంధనలు పాటించలేదు. అందుకే ఫైన్ వేయాలని నిర్ణయించాం. ఈ విషయమై కోర్టును ఆశ్రయించాం.. ఫైన్ ఎంత అన్నది కోర్టే నిర్ణయిస్తుంది’ అని రష్యా ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు.

మరోవైపు.. రష్యా నుంచి ఫేస్‌బుక్‌.. సుమారు 500 మిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని పొందుతోంది. అంటే మన భారత కరెన్సీలో.. దాదాపు 3 వేల కోట్ల రూపాయలకు పైనే ఆదాయాన్ని ఆర్జిస్తోంది. రష్యా చెబుతున్నట్టు.. 10 శాతం ఫైన్ విధిస్తే.. 300 కోట్ల రూపాయలకు పైనే ఫేస్‌బుక్‌ కట్టాల్సి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో.. రష్యన్ కోర్ట్ తుది నిర్ణయమే ఫైనల్ కానుంది.

Also Read: Facebook Outage : ఆమె లైవ్‌లో కనిపించింది అంతే.. క్షణాల్లో ఫేస్‌బుక్ సర్వీసులన్నీ బంద్..!