Viral Video: బస్సులో ఓ వ్యక్తిని చితగ్గొట్టిన డ్రైవర్.. తీవ్రగాయాలు

ఓ ద్విచక్ర వాహనదారుడిని బస్సు డ్రైవర్ అందరి ముందూ చితగ్గొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన కర్ణాటకలోని యెలహంకా ప్రాంతంలో చోటు చేసుకుంది. తన భార్యతో కలిసి సందీప్ (44) అనే వ్యక్తి బైకుపై వెళ్తున్నాడు. ఆ సమయంలో బస్సు డ్రైవర్ మరో బస్సును ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించాడు.

Viral Video: బస్సులో ఓ వ్యక్తిని చితగ్గొట్టిన డ్రైవర్.. తీవ్రగాయాలు

Viral Video: ఓ ద్విచక్ర వాహనదారుడిని బస్సు డ్రైవర్ అందరి ముందూ చితగ్గొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన కర్ణాటకలోని యెలహంకా ప్రాంతంలో చోటు చేసుకుంది. తన భార్యతో కలిసి సందీప్ (44) అనే వ్యక్తి బైకుపై వెళ్తున్నాడు. ఆ సమయంలో బస్సు డ్రైవర్ మరో బస్సును ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించాడు.

అయితే, అందుకు సందీప్ బైక్ అడ్డుగా వచ్చింది. దీంతో బస్సును సరిగ్గా పోనివ్వాలంటూ డ్రైవర్ కు సందీప్ చెప్పాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ చెలరేగింది. బస్సులోకి ఎక్కి సందీప్ గొడవపడ్డాడు. ఆ సమయంలో సందీప్ ను పట్టుకుని డ్రైవర్ చితగ్గొట్టాడు. సందీప్ పై పిగిగుద్దులు కురిపించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఓ కెమెరాకు చిక్కాయి.

సందీప్ నకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నాడు. ఈ ఘటన నేపథ్యంలో బస్సు డ్రైవర్ ను పనిలోంచి తొలగించారు. అతడు ప్రభుత్వ బస్సు నడుపుతున్నప్పటికీ, అతడిని ప్రైవేటు సంస్థ నుంచి తాత్కాలికంగా తీసుకున్నామని అధికారులు చెప్పారు. బస్సులో ఘర్షణ పడిన ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..