Bigg Boss Telugu 4 contestant : తొలి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి Monal Gajjar

  • Published By: sreehari ,Published On : September 6, 2020 / 05:42 PM IST
Bigg Boss Telugu 4 contestant :  తొలి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి Monal Gajjar

Bigg Boss Telugu 4 contestant Monal Gajjar: బిగ్ బాస్ 4 సీజన్ లో హౌస్‌లోకి అడుగుపెట్టిన మొదటి కంటెస్టెంట్ నటి Moni Gajjal.. అదిరిపోయే డ్యాన్స్ తో పర్ఫార్మెన్స్ ఇచ్చిన గజ్జల్ కు హోస్ట్ నాగార్జున వెల్ కమ్ చెప్పారు.. క్వారంటైన్ టైంలో తాను తెలుగు నేర్చుకున్నానంటూ చెప్పింది.. తన 15ఏటా తండ్రిని కోల్పోయానని, అప్పటినుంచి బంధాలు, అనుబంధాలన్నా ఎంతో ఇష్టమని.. ప్రతిఒక్కరితో ప్రేమగా మెలుగుతూ వారితో మంచి అనుబంధాలు లైఫ్ లాంగ్ ఉండాలని ఎప్పుడూ కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది..



హౌస్ లో తనను తాను పరిచయడం చేసుకుంటూ తన ఫ్యామిలీని మిస్ అవుతున్నానంటూ భావోద్వేగానికి గురైంది.. బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చావని నాగార్జున అడిగితే.. తెలుగు ప్రేక్షకులను అభిమానం ప్రేమను ఆకట్టుకునేందుకు వచ్చానంటూ బదులిచ్చింది.. తెలుగు డైలాగ్ చెప్పమంటే.. మాస్‌తో పెట్టుకుంటే దడదడ.. మా..మాస్… అంటూ తెలుగు డైలాగ్ చెప్పి అదరగొట్టేసింది.. గోవిందా.. గోవిందా అంటూ.. తొలి కంటెస్టెంట్ గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
monalఅందాల భామ మోనాల్ గజ్జర్ అనగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చే మూవీ సుడిగాడు.. 2012లో అలరి నరేష్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ దగ్గరయింది.



అహ్మదాబాద్ నుంచి వచ్చిన కామర్స్ గ్రాడ్యుయేట్ మోడలింగ్ గుజరాత్ మిస్ మోనాల్ గజ్జర్ సినిమాల్లోకి రాక ముందు ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేసింది. తన యోగా గురువు ప్రోత్సాహంతో, మోనాల్ 2011లో మిర్చి క్వీన్ బీ అందాల పోటీలో పాల్గొన్నారు.

అందులో మిస్ గుజరాత్ కిరీటాన్ని దక్కించుకుంది. తన తెలుగు తొలి చిత్రం సుడిగాడుతో నటి గజ్జర్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. వెన్నెలా 1 1/2, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి వంటి చిత్రాలతో పాటు ఆమె తమిళ తొలి చిత్రం సిగరమ్ తోడు, మలయాళ తొలి డ్రాక్యులా 2012, అనేక ఇతర చిత్రాలలో నటించింది.



2017లో వచ్చిన దేవదాసి ఆమె చివరి తెలుగు చిత్రం కూడా. బిగ్ బాస్ తెలుగు సీజన్ కోసం మోనాల్ తెలుగు కూడా నేర్చుకుందని టాక్.. మూవీల్లో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ భామ బిగ్ బాస్ హౌస్ లో ఎలా మెప్పిస్తుందో చూడాలి.



నాగార్జున అక్కినేని హోస్ట్ చేసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఈ రాత్రి (సెప్టెంబర్ 6) సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. ప్రీమియర్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఈ సీజన్‌లోని 16 మంది పోటీదారులను రివీల్ చేయనున్నారు.