Bill Gates: పౌలా హర్డ్ తో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ డేటింగ్

ఒరాకిల్ మాజీ సీఈవో, దివంగత మార్క్ హర్డ్ భార్య పౌలా హర్డ్ (60)తో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (67) డేటింగ్ లో ఉన్నారు. బిల్ గేట్స్ తన భార్య మెలిండా ఫ్రెంచ్ కు 2021 ఆగస్టులో విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచును బిల్ గేట్స్, పౌలా హర్డ్ కలిసి చూశారు.

Bill Gates: పౌలా హర్డ్ తో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ డేటింగ్

Bill Gates

Bill Gates: ఒరాకిల్ మాజీ సీఈవో, దివంగత మార్క్ హర్డ్ భార్య పౌలా హర్డ్ (60)తో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (67) డేటింగ్ లో ఉన్నారు. బిల్ గేట్స్ తన భార్య మెలిండా ఫ్రెంచ్ కు 2021 ఆగస్టులో విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచును బిల్ గేట్స్, పౌలా హర్డ్ కలిసి చూశారు.

వీరి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. అంతేగాక, మరికొన్ని క్రీడా కార్యక్రమాల్లోనూ వారిద్దరు కలిసి పాల్గొన్నారు. ఒరాకిల్ మాజీ సీఈవో మార్క్ హర్డ్ 2019లో కన్నుమూశారు. ఆయన భార్య పౌలా హర్డ్ 1984లో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

ఆమె ప్రస్తుతం పర్సనల్, కార్పొరేట్, చారిటేబుల్ ఈవెంట్ల ఆర్గనైజర్, డెవలపర్ గా పనిచేస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె ఉత్సాహంగా పాల్గొంటారు. భారీగా విరాళాలు ఇస్తుంటారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బిల్ గేట్స్ కి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

బిల్ గేట్స్ కూడా సామాజిక సేవా కార్యక్రమాలకు భారీగా విరాళాలు అందిస్తుంటారు. బిల్ గేట్స్-పౌలా హర్డ్ దాదాపు ఏడాదిగా డేటింగ్ లో ఉన్నారని, అయితే, తమ రిలేషన్ షిప్ గురించి బయటకు తెలియనివ్వలేదని తెలుస్తోంది. ఇప్పుడు మాత్రం పలు కార్యక్రమాల్లో జంటగా పాల్గొంటున్నారు.

Tripura Election: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన జేపీ నద్దా