Bill Gates and Musk: ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం: ఎలాన్ మస్క్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బిల్ గేట్స్

ట్విట్టర్ ఇంక్‌"ని కొనుగోలు చేయడంలో మస్క్ ఉద్దేశ్యం ఏంటో తనకు ఖచ్చితంగా తెలియదని ఏది ఏమైనా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో సోషల్ మీడియా మంచి పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని బిల్ గేట్స్ అన్నారు

Bill Gates and Musk: ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం: ఎలాన్ మస్క్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బిల్ గేట్స్

Bill Gates

Bill Gates and Musk: మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన బిల్ గేట్స్..టెస్లా కార్ల సంస్థ అధినేత ఎలాన్ మస్క్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాన్ మస్క్ ఇటీవల ట్విట్టర్ సంస్థను కొనుగోలు చేయడంపై బిల్ గేట్స్ స్పందిస్తూ..”ట్విట్టర్ ఇంక్‌”ని కొనుగోలు చేయడంలో మస్క్ ఉద్దేశ్యం ఏంటో తనకు ఖచ్చితంగా తెలియదని ఏది ఏమైనా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో సోషల్ మీడియా మంచి పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని బిల్ గేట్స్ అన్నారు. ది వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించే CEO కౌన్సిల్ సమ్మిట్ కార్యక్రమంలో బుధవారం బిల్ గేట్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలపై ఆయన మాట్లాడుతూ..ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను ఎందుకు కొన్నాడో తనకు తెలియదని..అయితే “అతను దానిని మరింత దిగజార్చవచ్చు. అతని ట్రాక్ రికార్డ్ అది కాదు కదా” అని గేట్స్ వ్యాఖ్యానించారు.

Also Read:Corona Next Season: మరోసారి కరోనా వ్యాప్తి తప్పదు: ఇజ్రాయెల్ పరిశోధకులు

సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ఎక్కువగా జరుగుతుందని..అయితే ట్విట్టర్ విషయంలో దాన్ని మస్క్ ఎలా అదుపు చేస్తారనేదే ముఖ్యమైన విషయమని బిల్ గేట్స్ పేర్కొన్నారు. “వ్యాక్సిన్‌లు ప్రజలను చంపేస్తాయని లేదా ప్రజల జాడ కనిపెట్టే పనిలో బిల్ గేట్స్ ఉన్నాడు అనే తప్పుడు వార్తల గురించి విన్నపుడు మస్క్ ఎలా స్పందిస్తారు? ఆ విషయంలో అతను ఏమి చేయబోతున్నాడో పూర్తిగా స్పష్టంగా లేదు” అని గేట్స్ అన్నారు. కాగా టెస్లా కార్ల సంస్థ విలువను తగ్గించేలా బిల్ గేట్స్ వ్యాఖ్యలు చేశారని ఇటీవల ఒక ట్వీట్ లో మస్క్ పేర్కొన్నాడు.

Also read:iPhone 14 : ఐఫోన్ 14 లాంచ్ మరింత ఆలస్యం.. కరోనా కేసుల ఎఫెక్టేనా?

అయితే వాతావరణ మార్పులలో దాతృత్వం గురించి చర్చించడానికి బిల్ గేట్స్ మస్క్ ని సంప్రదించారు. ఈ సంధర్భంగా టెస్లా సంస్థ విలువలో ఇప్పటికీ $500 మిలియన్లకు తగ్గించారా? అని బిల్ గేట్స్ ను మస్క్ ప్రశ్నించారు. అందుకు గేట్స్ ప్రతిస్పందిస్తూ తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. దీంతో “నా కార్ల సంస్థను చిన్నదిగా చేస్తూ మీ వ్యాఖ్యలు నిజమే అయితే.. వాతావరణ మార్పులలో మీరు చేసే దాతృత్వాన్ని తాను తీవ్రంగా పరిగణించలేన”ని మస్క్ పేర్కొన్నాడు.

Also Read:Elon Musk : ఎలాన్ మస్క్‌కు ఫీలింగ్స్ ఉన్నాయి.. ఇదిగో ఆయన కన్నీళ్లే సాక్ష్యం..!