Viral Video: యజమానికి వీడ్కోలు పలికిన పని మనిషి కుటుంబం.. ఇంటికి పిలిచి ఆతిథ్యం.. ఆకట్టుకుంటున్న వీడియో

యజమాని కుటుంబానికి చెందిన యువకుడు వేరే ఊరు వెళ్తుండటంతో వాళ్లింట్లో పని మనిషి అతడికి ఘనమైన వీడ్కోలు పలికింది. తమ ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.

Viral Video: యజమానికి వీడ్కోలు పలికిన పని మనిషి కుటుంబం.. ఇంటికి పిలిచి ఆతిథ్యం.. ఆకట్టుకుంటున్న వీడియో

Viral Video: కొంత మంది ఇళ్లల్లో పని వాళ్లకు, యజమానికి మధ్య విడదీయరాని బంధం ఏర్పడుతుంది. వాళ్ల మధ్య ఒకే కుటుంబం అనే భావన ఉంటుంది. అలాంటి వాళ్లలో ఎవరు వేరే చోటుకు వెళ్లిపోతున్నా అందరిలోనూ తెలియని బాధ. ఇలాంటి సందర్భాల్లో ఒకరిపై ఇంకొకరికి ఉన్న అనుబంధాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

Love Is Blind: 70 ఏళ్ల వృద్ధుడితో ప్రేమలో పడ్డ 19 ఏళ్ల యువతి.. పెళ్లి కూడా చేసుకున్న ప్రేమ జంట!

తాజాగా ఒక మహిళ తను పని చేసే యజమాని కుటుంబానికి చెందిన యువకుడికి ఘనంగా వీడ్కోలు పలికింది. ఆ యువకుడు వేరే చోటుకు పని కోసం వెళ్తుండటంతో అతడిని తన ఇంటికి పిలిచి, ఆతిథ్యం ఇచ్చింది. అనిష్ భగత్ అనే యువకుడి ఇంట్లో రేష్మ అనే మహిళ పని చేస్తోంది. రోజూ అనిష్‌కు సంబంధించిన అన్ని విషయాల్ని తనే చూసుకునేది. అతడి గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రేమగా చూసుకునేది. అతడు కూడా ఆమె విషయంలో అంతే ప్రేమగా, గౌరవంగా ఉండేవాడు. అయితే, ఇటీవల అతడు పని కోసం వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. దీంతో అనీష్ ఊరు వదిలి వెళ్తుండటంతో రేష్మ భావోద్వేగానికి గురైంది. అతడికి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలనుకుంది. అనీష్‌ను తన ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చింది.

India vs New Zealand: రేపే న్యూజిలాండ్‌తో మూడో టీ20.. వర్షం ముప్పు తప్పదా?

ఇంటికి ఆ కుటుంబం సంప్రదాయబద్ధంగా ఆహ్వానించింది. తమదైన స్థాయిలో విందు భోజనం ఏర్పాటు చేసింది ఆ కుటుంబం. పని మనిషే అయినప్పటికీ, ఆమెపై ఉన్న గౌరవంతో అనీష్ వారి ఇంటికి వెళ్లి, ఆతిథ్యాన్ని స్వీకరించాడు. దీనికి సంబంధించిన వీడియోను అతడు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. రేష్మను, ఆమె కుటుంబాన్ని వదిలివెళ్తున్నందుకు బాధగా ఉందని తన పోస్టులో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

 

View this post on Instagram

 

A post shared by Anish Bhagat (@anishbhagatt)