Love : ప్రియురాలిని స్నేహితులకు ఇచ్చిన ప్రబుద్దుడు

ప్రియురాలిపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం తన స్నేహితులకు ఇచ్చేశాడో ప్రబుద్దుడు. ఈ ఘటన నామక్కల్‌‌లో జరగ్గా ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Love : ప్రియురాలిని స్నేహితులకు ఇచ్చిన ప్రబుద్దుడు

Love

Love : ప్రేమించిన యువతిపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం ఆమెను తన స్నేహితుల చేతిలో పెట్టాడో ప్రబుద్దుడు.. ఆమె సృహతప్పడంతో స్నేహితులతో కలిసి బీహార్ పారిపోయేందుకు యత్నించాడు. కాగా ఈ ఘటన తమిళనాడు లోని నామక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బీహార్‌కు చెందిన యువతి నామక్కల్ వెప్పేడులోని ఓ ప్రైవేట్ మిల్లులో పనిచేస్తుంది. అదే మిల్లులో పనిచేసే బాల్‌రాజ్‌తో యువతికి పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది.

చదవండి : Sexual Harassment : నాతో సినిమాకు వస్తే పింఛన్ శాంక్షన్ చేస్తా…

ఇక ఆదివారం సెలవుదినం కావడంతో ప్రియురాలిని ఇంటికి తీసుకెళ్లాడు బాల్‌రాజ్‌, ఇంట్లో ఎవరు లేరని గమనించిన యువతి.. బయటకు వచ్చేందుకు యత్నించగా ఆమె మీద లైంగిక దాడి చేశాడు. అనంతరం తన స్నేహితులను పిలిపించి ఆమెను అప్పగించాడు. ముగ్గురు పలుమార్లు లైంగిక దాడి చేయడంతో యువతి స్పృహతప్పి పడిపోయింది. దీంతో భయపడిన ప్రియుడు బాల్‌రాజ్‌, అతడి స్నేహితులు ప్రదీప్, మనోజ్‌లు పారిపోయారు.

చదవండి : Illegal Affair Murder : తన కాపురం నిలబెట్టుకునేందుకు హత్య చేసిన ఇల్లాలు

అర్ధరాత్రి స్పృహలోకి వచ్చిన యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాల్‌రాజ్‌ ఇంటికి చేరుకున్న పోలీసులు సదరు యువతి నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి బీహార్ పారిపోవడానికి సిద్దమవుతున్న ముగ్గురిని పట్టుకొని స్టేషన్ కి తరలించారు.