Lock down : ఇదేనా లాక్ డౌన్ అంటే?..హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్..రంగంలోకి దిగిన డీజీపీ

కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ హైదరాబాద్ నగరంలో అమలు అవుతోందా? అంటే ఆలోచించాల్సిందే. ఎందుకంటే లాక్ డౌన్ నిబంధనల్ని నగర వాసులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఇష్టమొచ్చినట్లుగా తిరిగేస్తున్నారు. పోలీసులు జనాలను బయటకు రావద్దు మొర్రో మని మొత్తుకుంటున్నా..ఏమాత్రం బేఖాతరు చేయట్లేదు. దీనికి నిదర్శనం హైదరాబాద్ నగరంలో లాక్ డౌన్ సమయం దాటిపోయినా.. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోవటమే.

Lock down : ఇదేనా లాక్ డౌన్ అంటే?..హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్..రంగంలోకి దిగిన డీజీపీ

Break The Lock Down

Break The Lock down rules in Hyderabad : కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ హైదరాబాద్ నగరంలో అమలు అవుతోందా? అంటే ఆలోచించాల్సిందే. ఎందుకంటే లాక్ డౌన్ నిబంధనల్ని నగర వాసులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. తప్పనిసరి పనులమీద తిరుగుతున్నారో..లేదా ఇళ్లల్లో ఉండలేక బయటకు వస్తున్నారో తెలీదుగానీ ఇష్టమొచ్చినట్లుగా తిరిగేస్తున్నారు. ఉదయం 10.00గంటల వకూ లాక్ డౌన్ నిబంధనల సడిలింపు ఉంది. ఆ తరువాత ఎక్కడవారు అక్కడ గప్ చిప్ అన్నట్లుగా బయట కనిపించకూడదు. ఇది లాక్ డౌన్ రూల్. కానీ హైదరాబాద్ లో మాత్రం అటువంటి పరిస్థితి కనిపించట్లేదు. పోలీసులు జనాలను బయటకు రావద్దు మొర్రో మని మొత్తుకుంటున్నా..ఏమాత్రం బేఖాతరు చేయట్లేదు. దీనికి నిదర్శనంగా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోవటమే.

కరోనా కేసులు..మరణాలు పెరుగుతున్న క్రమంలో మే 30 వరకూ ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడిగించిన విషయం తెలిసిందే. కానీ నగరంలో అటువంటి పరిస్థితి కనిపించటంలేదు. ఈరోజు కూడా అదే పరిస్థితి. సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద ట్రాఫిక్ భారీగా జామ్ అయిపోవటంతో పోలీసులు క్లియర్ చేయటాన్ని నానా తంటాలు పడుతున్నారు.

టూ వీలర్లు, ఫోర్ వీలర్లు ఎక్కువ సంఖ్యలో వచ్చేస్తుండటంతో అదీకూడా 10.00గంటలు దాటి 12 కావస్తున్నా అదే పరిస్థితి. దీంతో పోలీసులు సదరు వాహనాలను ఆపివేసి చెక్ చేస్తున్నారు. వాహనాలను సీజ్ చేస్తున్నారు. దీంతో వాహనదారులు చాలా ఇంపార్టెంట్ పనిమీద వెళుతున్నాం సార్..అంటూ పోలీసుల్ని వాహనాలు ఇచ్చేమని బతిమిలాడుకుంటున్నారు.

లాక్ డౌన్ సమయంలో ప్యారడైజ్ వద్ద నిలిచిన ట్రాఫిక్ ను డీజీపీ మహేందర్ రెడ్డి అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలా లాక్ డౌన్ ఎలా అమలు జరుగుతోంది నగరం అంతా పర్యటించి పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో అనవసరంగా రోడ్డుమీదకు వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు.