మీ కారుపై సైకిల్ ఇలా క్యారీ చేస్తున్నారా? రూ.5వేలు ఫైన్ కట్టేందుకు రెడీగా ఉండండి!

  • Published By: sreehari ,Published On : October 20, 2020 / 07:00 PM IST
మీ కారుపై సైకిల్ ఇలా క్యారీ చేస్తున్నారా? రూ.5వేలు ఫైన్ కట్టేందుకు రెడీగా ఉండండి!

Carry a cycle on your car : కరోనా టైమ్‌లో అందరూ కొత్త అలవాట్లు నేర్చేసుకుంటున్నారు. మునపటి కంటే కొత్త అలవాట్లతో జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

ఇక మెట్రో సిటీల్లో అయితే చాలామంది తమ ఆఫీసులకు కార్లు, బైక్ లకు బదులుగా సైకిళ్లను వాడుతున్నారు. కరోనా భయంతో ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫుడ్ విషయంలోనూ ప్రత్యేకించి డైట్ పాటిస్తున్నారు.



సైకిల్ తొక్కితే వ్యాయామం చేసినట్టుగా ఉంటుందని చాలామంది సైకిల్ వినియోగంపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

car-cycle-rack

మరికొంతమంది కొంతదూరం కార్లలో ప్రయాణించి అక్కడి నుంచి సైకిళ్లపై స్వారీ చేస్తున్నారు. అందుకే కార్ల వెనుక ర్యాక్ పై సైకిళ్లను అటాచ్ చేసి క్యారీ చేసేస్తున్నారు.



ఇప్పుడు రోడ్లపై వెళ్లే కార్లపై సైకిళ్లను క్యారీ చేయడం కామన్ అయిపోయింది.. బెంగళూరులో మాత్రం ఇలా కార్లపై సైకిళ్లను క్యారీ చేయకండి.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.. జాగ్రత్త.. మీ కార్లపై ఇలా సైకిళ్లతో కనిపిస్తే రూ.5 వేలు వరకు ఫైన్ కట్టాల్సిందే.



సరైన ఆర్టీఓ నిబంధనలు పాటించకుండా రోడ్లపై వెళ్లే కార్లు వెనుక ఇలా సైకిళ్లను క్యారీ చేస్తే రూ.5 వేల వరకు భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవలే ఎలక్ట్రానిక్స్ సిటీకి చెందిన ప్రశాంత్ సుకుమరన్‌కు బెంగళూరు పోలీసులు జరిమానా విధించారు.



తన కారులో కుమారుడితో పాటు వెళ్తున్నాడు. తన కారుకు వెనుక ర్యాక్ పై సైకిళ్లను అటాచ్ చేశాడు. తిరిగి వెళ్తుండగా.. అది చూసిన బెంగళూరు పోలీసులు కారును ఆపి భారీ జరిమానా వేశారు.
car-cycle-rackకారుపై ఒక సైకిల్ మాత్రమే అనుమతి ఉందని, రెండు సైకిళ్లు క్యారీ చేస్తున్నందున రూ.5 వేలు జరిమానా చెల్లించాల్సిందిగా చెప్పారు.