Jairam Ramesh: కొవిడ్‭ను రాజకీయం చేసిన కేంద్రం, అందుకే గైడ్‭లైన్స్ లేవు.. జైరాం విమర్శలు

కొద్ది రోజుల క్రితం కొవిడ్-19 అంటూ హడావుడి చేసిన కేంద్ర ప్రభుత్వం, నాలుగు రోజులు పోయాక ఆ ప్రస్తావనే ఎత్తడం లేదు. ఇక కొవిడ్ నిబంధనలు వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ ఇప్పటి వరకు కేంద్రం నుంచి అలాంటివి రాలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొవిడ్‭ను కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేసిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శించారు

Jairam Ramesh: కొద్ది రోజుల క్రితం కొవిడ్-19 అంటూ హడావుడి చేసిన కేంద్ర ప్రభుత్వం, నాలుగు రోజులు పోయాక ఆ ప్రస్తావనే ఎత్తడం లేదు. ఇక కొవిడ్ నిబంధనలు వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ ఇప్పటి వరకు కేంద్రం నుంచి అలాంటివి రాలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొవిడ్‭ను కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేసిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. వాస్తవానికి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కొవిడ్ నిబంధనలు పాటించలేదని ఆ మధ్య బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్ జోడో యాత్రను చూసి బీజేపీ భయపడుతోందని అప్పుడే కాంగ్రెస్ నేతలు విమర్శించారు. తాజాగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మరోసారి విమర్శలు గుప్పించారు జైరాం.

Bharat Jodo Yatra: ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ హెచ్చరిక

‘‘భారత్ జోడో యాత్ర ఆపడానికి బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే ఈ యాత్ర ద్వారా దేశ ప్రజలంతా రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. ప్రజల్లో రాహుల్‭కు విశేష ఆదరణ వస్తోంది. ఇది చూసి బీజేపీ ఓర్వలేకపోతోంది. తమ పీఠాలు కూలిపోతాయని భయపడుతోంది. అందుకే యాత్రను ఆపడం కోసం కొవిడ్ అంటూ హడావుడి చేసింది. కొవిడ్‭ను కూడా కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేసింది. ఒక వేళ నిజంగానే కొవిడ్ వస్తే ఎందుకు ఇప్పటి వరకు నిబంధనలు విడుదల చేయలేదు?’’ అని జైరాం రమేశ్ ప్రశ్నించారు.

Rajasthan: కాంగ్రస్‭‭ పార్టీని కలవరపెడుతున్న సచిన్ పైలట్ సోలో క్యాంపెయిన్స్

ట్రెండింగ్ వార్తలు