Chili Pests : మిరపలో తెగుళ్లు, నివారణ పద్ధతులు!

తెగులు సోకిన కొమ్మలు కొన భాగం నుండి క్రిందికి వడలి ఎండిపోతాయి. ఈ శిలీంధ్రం పచ్చి మరియు పండు కాయలపై ఆశించినపుడు కాయలపై ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి.

Chili Pests : మిరపలో తెగుళ్లు, నివారణ పద్ధతులు!

Chili pests, prevention methods!

Chili Pests : మిరపను ఎర్రబంగారంగా పిలిచుకుంటారు. సేంద్రీయ పదార్థం అధికంగా ఉన్న అన్ని రకాల నెలల్లో మిరప సాగు చేపట్టవచ్చు. ఉదజని సూచిక 6 – 6.6 ఉన్న నేలలు చక్కటి అనుకూలం.మిరప సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే 10 డిగ్రీల నుండి 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వాతావరణం చక్కటి అనుకూలంగా చెప్పవచ్చు. మిరప పంటకు ఎర్రనేలలు మరియు నల్లరేగడి నేలలు అనువైనవి. మిరపసాగులో అధిక దిగుబడులు సాధించడానికి సరైన సస్యరక్షణ పద్ధతులు పాటించాలి. ఈ పంటలో కొన్ని మెళకువలు పాటిస్తే మంచి పంట దిగుబడి పొందవచ్చు.

తెగుళ్ళు నివారణా పద్ధతులు:

నారుకుళ్ళు తెగులు : నారుమడి పెంపకానికి ఎత్తైన నారుమడులు వేసుకోవడం మంచిది. లేకపోతే నీరు నిలిచి లేత మొక్కల మొదలు మెత్తబడి చనిపోతుంది. దీని నివారణకు మొదట విత్తనాలకు థైరం లేదా కాప్టాన్ 3 గ్రా./ కిలో విత్తనానికి విత్తనశుద్ధి చేసుకోవాలి. నారు మొలకెత్తిన తర్వాత 10 రోజుల వ్యవధితో కాపర్ ఆక్సిక్లోరైడ్ 3గ్రా./లీ కలిపి నారుమడి తడిచేలా పిచికారి చేయాలి.

ఎండు తెగులు: మొక్కలు ఎదిగే కొద్ది మొక్కల కాండం లోపలి భాగం ముదురు గోధుమ రంగులోకి మారి మొక్కలు, ఆకులు పూర్తిగా వడలిపోయి క్రిందకు రాలుతాయి.దీని నివారణకు మొదట విత్తనశుద్ధిలో ట్రైకోడెర్మా విరిడే 4గ్రా./కి. విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. నత్రజని, నీటి తడులు తగ్గించాలి.కాపర్ ఆక్సిక్లోరైడ్3 గ్రా. /లీ.నీటికి కలిపి మొక్కల మొదళ్ళు కలిసేలా చేయాలి.

కాయ కుళ్ళు తెగులు: ఈ వ్యాధి కొల్లెటోట్రైకమ్ క్యాప్సిన్ అను శిలీంద్రం ద్వారా వ్యాపిస్తుంది. ఈ శిలీంధ్రం గాలి మరియు విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. సామాన్యంగా అక్టోబర్ మరియు నవంబర్ మాసాల్లో లేత కొమ్మలకు మరియు పుష్పాలకు ఈ తెగులు ఆశిస్తుంది. ఈ తెగులు మొదట పుష్పాలకు ఆశించి క్రమంగా కాండం కొమ్మలకు వ్యాపిస్తుంది. కొమ్మల బెరడు పై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు పెద్దవైన తరువాత మచ్చల మధ్య భాగంలో శిలీంధ్ర బీజాలు వలయాలుగా ఉంటాయి. తెగులు సోకిన కొమ్మలు కొన భాగం నుండి క్రిందికి వడలి ఎండిపోతాయి. ఈ శిలీంధ్రం పచ్చి మరియు పండు కాయలపై ఆశించినపుడు కాయలపై ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత కాయలు కుళ్ళి వాడిపోతాయి.

దీని నివారణకు పొలాన్ని శుభ్రంగా దున్నాలి. కిలో విత్తనానికి 3 గ్రా. కాప్టస్ / మాంకోజెట్ తో విత్తన శుద్ధి చేయాలి. ఆరోగ్యవంతమైన మొక్కల నుండి విత్తనాన్ని సేకరించాలి. ప్రోపికొనజోల్ 2 మి.లీ. డైఫెన్ కొనజోల్ మి.లీ. 1 లీటరు నీటికి కలిపి పూత సమయంలో కాయలు పండు బారే సమయంలో పిచికారి చేయాలి.

బూడిద తెగులు: ఈ వ్యాధి లెవెల్యుల టారిక అను శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు ఎక్కువగా నవంబర్ మరియు మార్చి మాసాల మధ్యలో మిరప పైరుకు ఎక్కువగా ఆశిస్తుంది. మొదట మొక్కల క్రింది ఆకులపై తెల్లటి బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. క్రమేపీ ఈ మచ్చలు పెద్దవై ఆకు అంతటా వ్యాపించి పైకి కూడా విస్తరిస్తాయి. వ్యాధి సోకిన ఆకులు పసుపు రంగు గా మారి ఎండి రాలిపోతాయి. ఈ తెగులు సోకటం వలన పూత విపరీతంగా రాలిపోతాయి. మొక్కలలో పుష్పించే శక్తి క్షీనిస్తుంది. చల్లని పొడి వాతావరణం ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. దీని నివారణకు నీటిలో కరిగే గంధకం 3%, కేరాథెన్ 0.1% మందును పిచికారి చేయాలి.

బాక్టీరియా ఆకు మచ్చ తెగులు: ఈ వ్యాధి జాంతోమొనాస్ కాంపెస్టిస్ ఎసికటోరియా అనే బాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. ఆకుల పై చిన్న చిన్న గుండ్రని లేదా ఆకృతి లేని నీటితో తడిపినటువంటి మచ్చలు ఆకు అడుగు భాగాన ఏర్పడతాయి. ఈ మచ్చలు ముదురు గోధుమ రంగులో నుండి ఊదా రంగులోనికి మారి మచ్చల మధ్యలో నల్లగా ఉంటాయి. ఈ మచ్చల మధ్యలో గుంతగా ఉండి ఉబ్బి ఉంటాయి. తర్వాత ఈ ఉబ్బిన భాగము గరుకుగా మారుతుంది. మచ్చల చుట్టూ చిన్న పసుపు పచ్చని వలయం ఉంటుంది. మచ్చలు ఆకు అంతటా వ్యాపించి ఆకులు ఎండి రాలిపోతాయి. కొన్నిసార్లు ఆకు తొడిమ, లేత కొమ్మలపై కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. పచ్చి కాయల పై నీటిలో తడిపినటువంటి మచ్చలు కూడా ఏర్పడతాయి. దీని నివారణకు ఫాంటోమైసిస్ లేక స్ట్రెప్టోసైక్లిస్ 200 మందును ఏదైనా రాగి ధాతువు కల్గిన శిలీంద్ర నాశిని 0.25% కలిపి రెండు లేక మూడు సార్లు పిచికారి చేయాలి