CM KCR Serious Fire Incident : నూతన సచివాలయ అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్

తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. నూతన సచివాలయ అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా దృష్టి పెట్టాలన్నారు.

CM KCR Serious Fire Incident : నూతన సచివాలయ అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్

CK KCR

CM KCR Serious Fire Incident : తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. నూతన సచివాలయ అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా దృష్టి పెట్టాలన్నారు. సచివాలయ నిర్మాణం పూర్తయ్యేవరకూ అప్రమ్తతంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డితో సీఎం కేసీఆర్ మాట్లాడారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంలో ఇవాళ తెల్లవారుజాము 3:30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. కొత్త సచివాలయం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. భవనం కుడివైపు కొద్ది సేపు మంటలు ఎగబాకాయి. వెంటనే సచివాలయానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ తోనే కొత్త సచివాలయంలో మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు.

Fire Broke Out : తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం

మంటలు చెలరేగిన వెంటనే ఎన్ టీఆర్ మార్గ్ రోడ్డును రెండు వైపులా మూసివేశారు. దీంతో ఉదయం పూట వెళ్లే వాహనదారులు కొంత ఇబ్బంది అయింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉడ్ వర్క్ జరుగుతున్న చోట షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. సచివాలయం మొదటి ఫ్లోర్ వరకు మంటలు వ్యాపించడంతోపాటు దట్టమైన పొగలు అలుముకున్నాయి. సచివాలయం కుడి వైపు వెనుక భాగంలో మంటలు చెలరేగాయి.

వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో 11 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది సచివాలయానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి గంటన్నర సమయంలోనే మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.