Cock Birthday : గ్రాండ్‌గా కోడిపుంజు బర్త్ డే.. వీడియో వైరల్

ఎక్కడైనా, ఎప్పుడైనా కోడికి బర్త్ డే సెలబ్రేట్ చేయడం చూశారా? కనీసం విన్నారా? కోడికి పుట్టినరోజు వేడుకలు జరపడం ఏంటని విస్తుపోతున్నారా? కానీ, ఇది నిజం.

Cock Birthday : గ్రాండ్‌గా కోడిపుంజు బర్త్ డే.. వీడియో వైరల్

Cock Birthday

Cock Birthday : ఈ రోజుల్లో పెట్స్ బర్త్ డేలు సెలబ్రేట్ చేయడం ఓ ట్రెండ్ గా మారింది. కొందరు తాము ప్రేమగా పెంచుకునే శునకాలకు, మరికొందరు పిల్లులకు బర్త్ డే వేడుకలు చేయడం చూశాం, విన్నాం. శునకాలకు బర్త్ డేలు చేయడం, వాటిని అందంగా అలంకరించడం కామన్ గా మారింది. ఇందులో పెద్ద ఆశ్చర్యం లేదు. కానీ, ఎక్కడైనా, ఎప్పుడైనా కోడికి బర్త్ డే సెలబ్రేట్ చేయడం చూశారా? కనీసం విన్నారా? కోడికి పుట్టినరోజు వేడుకలు జరపడం
ఏంటని విస్తుపోతున్నారా? కానీ, ఇది నిజం.

WhatsApp Scam : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు మాయం

తాజాగా ఓ కుటుంబం తాము అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కోడిపుంజుకి హ్యాపీ బర్త్ డే చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బర్త్ డే కోసం పుంజుని అందంగా అలంకరించారు. మంచి కేక్ కూడా తెచ్చారు. మనుషులకు ఏ విధంగా అయితే పుట్టిన రోజు వేడుకలు జరుపుతారో అదే రీతిలో కోడిపుంజు బర్త్ డే సెలబ్రేట్ చేశారు.

Heart Disease : గుండె జబ్బులు రాకుండా నివారించటం ఎలాగంటే

ఆ కోడిపుంజు తెల్లగా మిలమిల మెరిసిపోతోంది. వీడియో ద్వారా దాని పేరు చిన్ను అని తెలుస్తుంది. దాని బర్త్ డే ను ఆ ఇంట్లో వాళ్లు చాలా గ్రాండ్ గా చేశారు. కలర్ పేపర్స్, బెలూన్స్ తో అలంకరణ చేశారు. అంతేకాదు పెద్ద కేక్ కూడా తెప్పించారు యజమానులు. అంతేనా.. బర్త్ డే వేడుక్కి చుట్టుపక్కల వారిని కూడా పిలిచారు.

చిన్నపిల్లాడిలా కోడిని ముద్దు చేస్తూ, ఒళ్లో కూర్చోపెట్టుకుని మరీ 2వ ఏడాది కేక్ కట్ చేయించారు. ఒక చాకు తీసుకుని కోడి కాలితో కేక్ కట్ చేయించారు. హ్యాపీ బర్త్ డే అంటూ విషెస్ కూడా తెలిపారు. క్లాప్స్ కొడుతూ దానికి బర్త్ డే విషెస్ తెలియజేశారు. అంతేనా దాంతో కలిసి ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. వీడియోలు కూడా తీశారు. ఆ తర్వాత కాస్త కేక్ చేతిలోకి తీసుకుని పుంజుకి టేస్ట్ కూడా చూపించారు యజమానులు. కోడిపుంజు పుట్టిన రోజు సెలబ్రేషన్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇదెక్కడి విడ్డూరం రా నాయనా అని నెటిజన్లు అంటున్నారు.