BiggBoss 5 : షన్నుకి షాక్ ఇచ్చిన కంటెస్టెంట్స్ .. ఈ వీక్ నామినేషన్స్ లో ఎవరున్నారో తెలుసా??

ఈ సారి బిగ్ బాస్ రోజు రోజుకి కొత్త ట్విస్ట్ లతో అలరిస్తుంది. ప్రేక్షకులకి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లా కనిపిస్తుంది. ప్రతిసారి కంటే ఈ సారి నామినేషన్స్ చాలా కొత్తగా, థ్రిల్ గా

BiggBoss 5 : షన్నుకి షాక్ ఇచ్చిన కంటెస్టెంట్స్ .. ఈ వీక్ నామినేషన్స్ లో ఎవరున్నారో తెలుసా??

Bb

BiggBoss 5 :  ఈ సారి బిగ్ బాస్ రోజు రోజుకి కొత్త ట్విస్ట్ లతో అలరిస్తుంది. ప్రేక్షకులకి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లా కనిపిస్తుంది. ప్రతిసారి కంటే ఈ సారి నామినేషన్స్ చాలా కొత్తగా, థ్రిల్ గా అనిపించాయి. అయిదో వారానికి సంబంధించిన నామినేషన్స్‌ ప్రక్రియ నిన్న ముగిసింది. గత నాలుగు వారాలకు పూర్తి విభిన్నంగా ఈసారి నామినేషన్స్‌ ని నిర్వహించారు. ప్రతి హౌస్‌మేట్‌ కన్ఫెషన్‌ రూమ్‌కు వచ్చి, హౌస్‌లో ఉండేందుకు అర్హతలేని, తమకు ఇష్టం లేని ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లను, అందుకు తగిన కారణాలను చెప్పాల్సిందిగా బిగ్‌బాస్‌ సూచించాడు. ప్రతివారం ఫేస్‌ టు ఫేస్‌ జరుగుతున్న నామినేషన్స్‌ ఈసారి ఇలా సీక్రెట్ గా జరుగుతుండటంతో ఇంటి సభ్యులందరూ ఎక్కువ టెన్షన్ పడ్డారు.

అయితే ఈ వారం ఎక్కువమంది షణ్ముఖ్ ని నామినేట్ చేసి షన్నుకి షాక్ ఇచ్చారు. గేమ్‌ సరిగా ఆడటం లేదని, ఎప్పుడూ కూర్చొని కబుర్లు చెబుతుంటాడని, సైలెంట్ గా పట్టించుకోకుండా ఉంటాడని ఇలా ఒక్కో కారణం చెప్పి ఎక్కువ మంది షన్నుని నామినేట్ చేయడం విశేషం. హౌస్ లో ఉన్న జెంట్ కంటెస్టెంట్స్ లో ఒక్క జెస్సీ తప్ప మిగిలిన వాళ్లంతా షన్నుని నామినేట్‌ చేయడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.

Mahesh Babu : నా సూపర్‌ ఉమెన్‌తో ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది : మహేష్

రవి తనని గేమ్‌ ఆడనీయకుండా చేస్తున్నాడని, గతవారం లోబో చేసిన పని కారణంగా బిగ్‌బాస్‌తో తిట్లు తిన్నానని జెస్సీ వాళ్లద్దరినీ నామినేట్‌ చేసాడు. అనీ మాస్టర్‌ పూర్తిగా సేఫ్‌ గేమ్‌ ఆడుతూ రవి,విశ్వాలను నామినేట్‌ చేసింది. మొత్తానికి ఈ వారం నామినేషన్స్ లో షణ్ముఖ్‌, లోబో, సన్నీ, విశ్వ, హమీద, మానస్‌, ప్రియ, జస్వంత్‌, రవిలు ఉన్నారు. గత వారాల కంటే ఈ వారం నామినేషన్స్ లోనే ఎక్కువ మంది నిలిచారు. హౌస్‌లో ప్రస్తుతం 15మంది ఉండగా ఏకంగా 9మంది నామినేషన్స్‌లో ఉన్నారు.

Aishwarya Rai Ramp Walk: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్య ర్యాంప్ వాక్

అయితే ఈ సారి ప్రైవేట్ గా నామినేషన్స్ తీసుకున్నారు, ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో ఎవరికీ తెలీదు అనుకున్నారు. కానీ బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్ కి గట్టిగానే షాక్ ఇచ్చాడు. ఎవరెవరు ఎవరిని నామినేట్‌ చేశారో బిగ్ బాస్ స్క్రీన్‌పై చూపించే సరికి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా ఒక్కసారిగా ఖంగు తిన్నారు. ఇక ఎక్కువ మంది షన్నుని నామినేట్ చేయటంతో అలాగే మొదటి సారి షన్ను నామినేషన్ లో ఉండటంతో బాగా కోపం తెచ్చుకొని ఫ్రస్టేషన్ కి గురయ్యాడు. ఇప్పటివరకూ నా ఆట చూడలేదు ఇక నుంచిచూస్తారు అంటూ జెస్సీ, సిరిలతో చెప్పాడు. హౌస్‌మేట్స్‌ అందరూ గ్రూప్‌గా ఏర్పడి, నన్ను నామినేట్‌ చేశారని బాధపడ్డాడు.