గుడ్ న్యూస్, ఒక్కసారి కరోనా వచ్చి తగ్గితే మరోసారి రాదంటున్న సైంటిస్టులు, అదెలా సాధ్యమో వివరించారు

  • Published By: naveen ,Published On : August 18, 2020 / 10:49 AM IST
గుడ్ న్యూస్, ఒక్కసారి కరోనా వచ్చి తగ్గితే మరోసారి రాదంటున్న సైంటిస్టులు, అదెలా సాధ్యమో వివరించారు

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ ఓ చిన్న రిలీఫ్. ఒక్కసారి కరోనా వైరస్ వచ్చి తగ్గితే చాలు, ఇక తిరిగి వైరస్ మన జోలికి రాదని సైంటిస్టులు చెబుతున్నారు. ఓసారి వైరస్ సోకిన వారికి తిరిగి సెకండ్ ఎటాక్ అనేది రాదే రాదని అంటున్నారు. అదెలా సాధ్యమో కూడా సైంటిస్టులు వివరించారు.



ఆ ముగ్గురికి ఎందుకు కరోనా సోకలేదంటే:
అమెరికాలోని సీటెల్ దగ్గర ఓ షిప్ లో 122 మంది ఉన్నారు. అందులో 104 మందికి కరోనా వైరస్ పట్టుకుంది. ముగ్గురు మాత్రం తప్పించుకున్నారు. అసలు వైరస్ వారి జోలికే రాలేదు. ఇదెలా సాధ్యమైంది? ఎందుకు వారికి వైరస్ అటాక్ అవ్వలేదు? అనేది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సైంటిస్టుల జరిపిన పరిశోధనలో ఓ ఊరటనిచ్చే న్యూస్ బయటకు వచ్చింది. ఆ ముగ్గురు షిప్ ఎక్కేముందే వైరస్ బారిన పడటం కోలుకోవడం కూడా జరిగింది. ఈ ఒక్క అంశంతో ఓ విషయంలో క్లారిటీ వచ్చేసింది.

నో సెకండ్ అటాక్:
కరోనా ఒక్కసారి వచ్చి తగ్గితే ఫుల్ సేఫ్ అంటున్నారు శాస్త్రవేత్తలు. కరోనా వచ్చి తగ్గితే ఇక అలాంటి పేషెంట్లకు తిరిగి వైరస్ సోకదని ప్రకటించారు. అంటే సెకండ్ వేవ్ అంటూ డబ్ల్యూహెచ్ఓ నుంచి అంతా భయపెడుతున్నదంతా సంఖ్య గురించే తప్ప వచ్చిన వారికి తిరిగి సోకదని ఓ క్లారిటీ అయితే వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్, మెడిసిన్ క్లినికల్ వైరాలజీ జాయింట్ రీసెర్చ్ లో ఊరట కలిగించే ఫలితాలు వెలుగులోకి వచ్చాయి.



ఇప్పటికి కరోనా విజృంభణ ప్రారంభమై 9 నెలలు దాటుతోంది. రష్యా ఓ వ్యాక్సిన్ విడుదల చేసింది. చైనా, అమెరికా, బ్రిటన్ లో ఒక్కో వ్యాక్సిన్ ఈ ఏడాది చివరికి లేదా 2021 జనవరి నాటికి విడుదల చేసే ఊపులో ఉన్నాయి. అంటే, 2020 వరకు జాగ్రత్తగా ఉంటే చాలు, కరోనా వైరస్ ను నియంత్రించగలమనే నమ్మకం కలుగుతోంది.

మరోసారి కరోనా రాకపోవడానికి యాంటీబాడీలే కారణం:
అయితే భారత్ సహా పలు దేశాల్లో లక్షలకు లక్షలు పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు చూస్తుంటే, కంటి మీద కునుకు ఉండటం లేదు. ఇలాంటి దశలోనే సెప్టెంబర్ నుంచి కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అవుతుందనే ఆందోళన మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. ఓసారి కరోనా వచ్చి తగ్గితే వారి శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయని, ఇక వైరస్ రాదని వాషింగ్టన్ యూనివర్సిటీ, మెడిసిన్ క్లినికల్ వైరాలజీ నిపుణులు చెబుతున్నారు. వీరు సంయుక్తంగా జరిపిన రీసెర్చ్ లో ఆసక్తికర విషయాలు తెలిశాయి. మెటార్జీ అనే పత్రికలో పబ్లిస్ చేసిన ఈ స్టడీ ఇప్పుడు చర్చకు దారితీసింది.



కరోనా నుంచి కాపాడే యాంటీబాడీలు:
యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సైంటిస్టులు తమ వాదనకు నిదర్శనంగా సీటెల్ షిప్ ఎపిసోడ్ ను చూపుతున్నారు. సీటెల్ నుంచి బోటులో ప్రయాణించిన 100మందిలో ముగ్గురికి మాత్రం వైరస్ సోకలేదు. దీనికి కారణం వారి శరీరంలో అప్పటికే యాంటీబాడీలు తయారయ్యాయి. అంటే ముందే కొవిడ్ 19 సోకి తగ్గింది. తర్వాత వైరస్ వారి జోలికి వెళ్లడం లేదని సైంటిస్టులు తమ రీసెర్చ్ లో తెలుసుకున్నారు.

రెండోసారి కరోనా సోకదనే గ్యారంటీ లేదు:
ఈ పరిశోధన ఫలితాలను మరింత విస్తృతంగా స్టడీ చేసేందుకు సైంటిస్టులు సిద్ధమయ్యారు. అయితే ఇదొక అంశం ఆధారంగానే ఒక్కసారి కరోనా వచ్చి తగ్గిన వారికి మరోసారి కొవిడ్ రాదని ఘంటాపథంగా చెప్పలేమని కొందరు అంటున్నారు. వైరస్ శరీరంలో వచ్చి తగ్గాక తిరిగి సోకదని నాలుగు నెలల క్రితమే చైనా చెప్పింది. సౌత్ కొరియా కూడా ఇదే విషయాన్ని చెప్పింది. దీంతో కరోనా సెకండ్ అటాక్ కి చాన్సులు తక్కువనే వాదనే ఇప్పుడు బలపడుతోంది.