Gautam Gambhir : చెన్నై విజయంపై స్పందించిన గంభీర్.. నమ్మశక్యంగా లేదంటూ ట్వీట్..
చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ సాధించడంపై మాజీ క్రికెటర్ గౌతమ్, లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో స్పందించారు.

Gautam Gambhir Praises CSK : ఐపీఎల్ 2023 (IPL 2023) విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఉత్కంఠభరిత పోరులో గుజరాత్ టైటాన్స్ జట్టును ఓడించి 5వ ఐపీఎల్ టైటిల్ (IPL Title) కైవసం చేసుకోవడంతో ధోని (Dhoni) సేనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలతో పాటు మాజీ క్రికెటర్లు అభినందనలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు.
ఐదుసార్లంటే మామూలు విషయం కాదు
ఐదోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభినందనలు తెలిపారు. ఐదుసార్లు టైటిల్ గెలవడం మామూలు విషయం కాదని వ్యాఖ్యానించారు. ఒక్కసారి విజేతగా నిలవడమే
కష్టం.. అలాంటి ఐదుసార్లు టైటిల్ సాధించడం నమ్మశక్యంగా లేదని ట్వీట్ చేశారు. కాగా, తాజా ఐపీఎల్ టోర్నమెంట్ లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్ జీ) జట్టుకు గంభీర్.. మెంటర్ గా వ్యవహరించారు.
Congratulations CSK! Winning 1 title is difficult, winning 5 is unbelievable! #IPL2023
— Gautam Gambhir (@GautamGambhir) May 30, 2023
ఘోర పరాజయంతో నిష్ర్కమణ
లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ప్లే ఆఫ్ చేరినప్పటికీ తుదిపోరుకు చేరలేకపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో 81 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలై టోర్ని నుంచి నిష్క్రమించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 8 వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది. లక్నో16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవంతో టోర్నిని వీడింది. రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కీలక మ్యాచ్ లకు దూరం కావడం లక్నోను దెబ్బతీసింది.
Also Read: ఐపీఎల్ 2023లో రికార్డులే రికార్డులు.. ఎక్కువ సిక్సర్లు, ఫోర్లు ఎవరు కొట్టారంటే..
కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్ గా రెండు సార్లు టైటిల్ అందించిన గౌతమ్ గంభీర్.. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మెంటర్ గా వ్యవహరించారు. గంభీర్ కెప్టెన్సీలో కేకేఆర్ (KKR) 2012, 2014లో ఐపీఎల్ టైటిల్ గెలిచింది.
Also Read: మహేంద్ర సింగ్ ధోనీని ఉద్దేశిస్తూ జడేజా ఆసక్తికర ట్వీట్.. ఫ్యాన్స్ ఖుషీ