Gold Silver Rates: దేశంలో స్థిరంగా 22 క్యారెట్ల బంగారం ధర, పడిపోయిన వెండి ధర

వివిధ రాష్ట్రాలు విధించే ప్రభుత్వ పన్ను, ఎక్సైజ్ డ్యూటీ మరియు ఇతర సుంకాలను పరిగణలోకి తీసుకుని నగరం నుంచి నగరానికి బంగారం ధరలు మారుతూ ఉంటాయి.

Gold Silver Rates: దేశంలో స్థిరంగా 22 క్యారెట్ల బంగారం ధర, పడిపోయిన వెండి ధర

Gold

Gold Silver Rates: దేశంలో బంగారం వెండి ధరలు స్వల్ప హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. వివిధ రాష్ట్రాలు విధించే ప్రభుత్వ పన్ను, ఎక్సైజ్ డ్యూటీ మరియు ఇతర సుంకాలను పరిగణలోకి తీసుకుని నగరం నుంచి నగరానికి బంగారం ధరలు మారుతూ ఉంటాయి. ఈక్రమంలో హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర Rs 47,950 ఉంది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150పెరిగి, రూ.52,460గా కొనసాగుతోంది. ఢిల్లీ మార్కెట్లోనూ బంగారం ధరలో సూక్ష్మ మార్పులకు గురైంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా రూ.47,950 వద్ద కొనసాగుతుండగా..24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.20 తగ్గి రూ.52,460 వద్ద ట్రేడ్ అవుతుంది.

Also read:Sri Lanka Crisis : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఎఫెక్ట్.. 26 మంది మంత్రుల రాజీనామా ..

ఇక విజయవాడలోనూ 22 క్యారెట్ల బంగారం ధరల్లో ఎటువంటి మార్పుల్లేదు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ.52,460కు చేరుకుంది. ఇక ఢిల్లీ మార్కెట్లో ఆదివారం రూ.3,700 పెరిగిన కేజీ వెండి ధర సోమవారం నాడు ఏకంగా రూ.4,500 మేర తగ్గి రూ.71,300 నుంచి రూ.66,800కు పడిపోయింది. దేశంలోని మిగతా ప్రాంతాల్లోనూ వెండి ధరలు పడిపోయాయి. ఏప్రిల్, మే నెలల్లో దేశ వ్యాప్తంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉన్నందున రానున్న రోజుల్లో బంగారానికి డిమాండ్ మరింత పెరగొచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also read:e-Sim in Android: సిమ్ కార్డు లేకుండానే పనిచేసే ఆండ్రాయిడ్ 13 ఓఎస్: డబల్ సిమ్ కూడా ఓకే