ఏపీలో మందుబాబులకు కిక్ ఇచ్చే న్యూస్, ఇతర రాష్ట్రాల నుండి మద్యం తెచ్చుకోవడానికి హైకోర్టు పర్మిషన్

  • Published By: naveen ,Published On : September 2, 2020 / 11:47 AM IST
ఏపీలో మందుబాబులకు కిక్ ఇచ్చే న్యూస్, ఇతర రాష్ట్రాల నుండి మద్యం తెచ్చుకోవడానికి హైకోర్టు పర్మిషన్

ఏపీలో మందుబాబులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి మద్యం తీసుకురావడానికి హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. అయితే ఒక వ్యక్తి మూడు బాటిళ్లు మాత్రమే తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుండి మద్యాన్ని తెచ్చుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది.



ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి మద్యం తెచ్చుకోవటంపై ఏపీ హైకోర్టు బుధవారం(సెప్టెంబర్ 2,2020) తీర్పు వెలువరించింది. ఇతర రాష్ట్రాల నుంచి 3 మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చని చెప్పింది. ఈ మేరకు జీవో నెంబర్ 411 ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

జీవో నెంబర్ 411 ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తెచ్చుకునే వీలున్నా, ఏపీ పోలీసులు అనుమతించడం లేదని, కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ దాఖలైన రిట్ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఈ తీర్పుని వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం ఏ వ్యక్తి అయినా ఇతర రాష్ట్రాల నుండి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చు. ఈ తీర్పుతో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నుండి మద్యం ప్రియులకు రిలీఫ్ లభించినట్టు అయ్యింది. మద్యం అక్రమ రవాణ కేసుల బాధ తప్పినట్టు అయ్యింది. ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల నుంచి ఒక్క మద్యం బాటిల్ తీసుకొచ్చినా పోలీసులు పట్టుకుంటున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు. ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండవని మద్యం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.