Kashmir Records : కశ్మీర్‌కు క్యూ కట్టిన పర్యాటకులు .. 75ఏళ్లలో సరికొత్త రికార్డు..

జమ్ముకశ్మీర్‌..అందాలకు కేరాఫ్ అడ్రస్. మంచు దుప్పటి కప్పుకున్న భూతల స్వర్గం. ఒక్కసారి అక్కడికి వెళితే మరోసారి చూడాలనిపించే అందాల స్వర్గ ధామం. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి ఈ స్వర్గాన్ని వెదుక్కుంటూ పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. 75 ఏళ్ల స్వతంత్ర్య భారతంలో.. కశ్మీర్‌లో పర్యాటకుల సంఖ్య సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేసింది. ఈ స్థాయిలో టూరిస్టులు పెరగడానికి కారణాలు ఏంటి.. అసలు కశ్మీర్‌ ప్రత్యేకతలు ఏంటి..

Kashmir Records : కశ్మీర్‌కు క్యూ కట్టిన పర్యాటకులు .. 75ఏళ్లలో సరికొత్త రికార్డు..

KASHMIR RECORDS : జమ్ముకశ్మీర్‌..అందాలకు కేరాఫ్ అడ్రస్. మంచు దుప్పటి కప్పుకున్న భూతల స్వర్గం. ఒక్కసారి అక్కడికి వెళితే మరోసారి చూడాలనిపించే అందాల స్వర్గ ధామం. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి ఈ స్వర్గాన్ని వెదుక్కుంటూ పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. 75 ఏళ్ల స్వతంత్ర్య భారతంలో.. కశ్మీర్‌లో పర్యాటకుల సంఖ్య సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేసింది. రారమ్మని పిలిచే మంచు కొండలు..స్వర్గాన్ని తలపించే తులిప్ పూల అందాలు..మైమరపించే ఆపిల్ తోటలు, చినార్ చెట్లు..ఇలా కశ్మీర్ అంటే ఓ స్వర్గం..ఓ అందాలలోకం..

స్వర్గం భూమి మీదకు చేరుకొని.. దారి మరిచిపోయి ఇక్కడే ఉండిపోయిందా అన్నట్లు ఉంటాయి కశ్మీర్ అందాలు ! ఒక్కసారి చూసొస్తే.. జీవితకాలానికి సరిపడే జ్ఞాపకాలతో తిరిగి రావచ్చు. చుట్టూ కొండలు.. చిన్నగా కురిసే మంచు.. కళ్లు పెద్దవి చేసే పచ్చదనం అందాలు.. మంచుకొండల మధ్యలోంచి నీలం రంగంలో ప్రవహించే నదులు.. దారి తప్పి స్వర్గానికి వచ్చామా అనే ఫీలింగ్ ఉంటుంది కశ్మీర్‌లో ! వేసవిలో పూల తోటలు, ఆపిల్ తోటలు, చినార్ చెట్లు కనువిందు చేసి భూతల స్వర్గంలా కనిపిస్తాయ్. చలికాలంలో మంచుకొండలు, మనుషులపై తుంపర్లు చల్లుతూ మెల్లిగా కదిలే పల్చటి తెల్లమేఘాలు, మంచులో అడుగు తీసి అడుగు వేస్తూ మంచు ముద్దలు విసురుకుంటూ ఆడుకునే పర్యాటకులు.. ఇలా ఎన్నో అందాలు కశ్మీర్‌ సొంతం !

ఎత్తైన శిఖరాలు, లోయలు, ఆలయాలు, సరస్సులు కశ్మీర్ ప్రత్యేక ఆకర్షణ. దాల్ సరస్సు, బోట్ హౌస్‌లు, తులిప్ గార్డెన్స్‌, నోరూరించే కశ్మీరి రుచులు.. ఇలా జమ్ముకశ్మీర్‌ప్రత్యేకతలు ఎన్నో ! ఇంత అందమైన ప్రాంతం.. కొన్నేళ్ల పాటు రక్తపు మరకలతో నిండిపోయింది. ఐతే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత పరిస్థితి మారింది. పర్యాటకం ఊపందుకుంది. సరికొత్త రికార్డులు నమోదు అవుతున్నాయ్. దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా.. ఈ ఇయర్‌ అత్యధిక మంది టూరిస్టులు జమ్ముకశ్మీర్ ప్రాంతాన్ని సందర్శించారు. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం 1.62 కోట్ల మంది పర్యాటకులు… జమ్మూకశ్మీర్‌ చూడటానికి వచ్చారు. అక్టోబర్‌, నవంబర్ నెలల్లో మరింత మంది పర్యాటకులు పెరిగిన పరిస్థితి.
కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయ్.

ముఖ్యంగా టూరిస్టు కేంద్రాల్లో పర్యాటకులను ఆకర్షించడానికి అధికారులు వివిధ పనులు చేపట్టారు. అందులో ఒకటి ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్ట్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో చీనాబ్ నదిపై నిర్మించిన కొత్త వంతెన. ఈ బ్రిడ్జి నిర్మాణంతో కశ్మీర్‌లోని ఇతర ప్రాంతాలకు కూడా ఇకపై తేలిగ్గా చేరుకోవచ్చు. ఈ నూతన రైల్వే మార్గం త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ ప్రాంతంలోని జనాలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి, సందర్శకులను ఆకర్షించడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. దీంతో జమ్మూ కశ్మీర్‌ పర్యాటక రంగంలో మరిన్ని కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయ్.

ప్రముఖ పర్యాటక ప్రదేశం తులిప్ గార్డెన్‌‌‌ను కూడా టూరిజం శాఖ మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. దీంతో అక్కడ కూడా ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టులకు కొత్త అనుభూతులను పంచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గందర్‌బల్‌లోని మనస్‌బల్ సరస్సు దగ్గర టూరిస్టులకు స్థానిక కళలు, సంస్కృతులు, వంటకాలు, వాటర్ స్పోర్ట్స్‌ యాక్టివిటీస్‌ ఎంజాయ్ చేసేవిధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పైన చెప్పిన లెక్కలు జనవరి నుండి సెప్టెంబర్ వరకు మాత్రమే. ఇప్పుడే శీతాకాలం మొదలవ్వడంతో రాబోయే రోజుల్లోనూ మరింత మంది పర్యాటకులు జమ్మూకశ్మీర్‌ను సందర్శించే అవకాశం ఉంది.

దసరా నుంచే కశ్మీర్‌కు పర్యాటకులు పోటెత్తుతున్నారు. అంతర్జాతీయ పర్యాటకుల కోసం శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌కు… పలు ప్రత్యక్ష అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా అందుబాటులోకి వచ్చాయ్. ఇక పర్యాటకుల రద్దీ పెరగడంతో.. స్థానికులకు భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయ్. పర్యాటకుల తాకిడితో… మంచు కొండలకు మరింత అందం అద్దినట్లు అవుతోంది.