Holi 2024: ఈ పాటలు విననిదే హోలీ జరుపుకోం.. వింటే డ్యాన్స్ చేయకుండా ఉండలేం

హోలీ అంటే కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు.. అంతకు మించి. చక్కని హోలీ పాటలు వింటూ, డ్యాన్స్ చేస్తూ హోలీ జరుపుకుంటాం.

Holi 2024: ఈ పాటలు విననిదే హోలీ జరుపుకోం.. వింటే డ్యాన్స్ చేయకుండా ఉండలేం

Holi 2023

హోలీ అంటే కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు.. అంతకు మించి. చక్కని హోలీ పాటలు వింటూ, డ్యాన్స్ చేస్తూ హోలీ జరుపుకుంటాం. ఇక టీవీల్లో హోలీ రోజు ఉదయం నుంచే హోలీ పాటలు వస్తుంటాయి. టాలీవుడ్, బాలీవుడ్ లో టాప్ హోలీ పాటలు ఏమున్నాదో చూద్దామా…

  • పవన్ కల్యాణ్-భూమిక నటించిన “ఖుషీ” సినిమాలో గజ్జె ఘల్లుమన్నాదిరో సాంగ్ ఇప్పటికీ హోలీకి మార్మోగిపోతూనే ఉంటుంది.
    “గజ్జె ఘల్లుమన్నాదిరో… గుండె ఝల్లుమన్నాదిరో.. వాన ఝల్లుమన్నాదిరో.. ఊరు ఘొల్లుమన్నాదిరో.. హోలీ హోలీల రంగ.. హోలీ హోలీల రంగ.. హోలీ హోలీల రంగ హోలీ” అంటూ ఈ పాట సాగుతుంది.
  • ఎన్టీఆర్, ఇలియానా నటించిన “రాఖీ” సినిమాలో “రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు బర్సే.. బర్సేబర్సేబర్సేబర్సేబర్సే” అంటూ హోలీ పాట ఉంటుంది.
  • ప్రభాస్‌ నటించిన “చక్రం” సినిమాలో వచ్చే రంగేళీ హోలీ పాట అందరినీ అలరిస్తుంది.
  • నవదీప్, పూనమ్ భజ్వా నటించిన “మొదటి సినిమా”లోని ఉరిమే మేఘమా హోలీకి సంబంధించిన పాటే.
  • నాగార్జున నటించిన మాస్ సినిమాలో “కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనె లైఫ్ ఉందిరా” పాట హోలీ పాటే.
  • బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ సిల్సిలా సినిమాలో రంగ్ బసేరా పాట ఇప్పటికీ అలరిస్తూనే ఉంది.
  • అమితాబ్ బచ్చన్ నటించిన షోలే సినిమాలోని హోలీ కేదిన్ పాట ఉంది. హోలీ వేళ ఇది తప్పకవినపడుతూనే ఉంటుంది.
  • అక్షయ్ కుమార్ నటించిన జాలీ ఎల్ఎల్‌బీ-2 సినిమాలో “గో పాగల్” పాట హోలీ పాటే.

Holi 2024: హోలీని ఎందుకు జరుపుకుంటారు? ఆ పండుగ ప్రత్యేకత ఏంటీ?