నా భార్య నాక్కావాలి : మంచిర్యాలలో భర్త మౌనపోరాటం

  • Published By: madhu ,Published On : July 26, 2020 / 10:41 AM IST
నా భార్య నాక్కావాలి : మంచిర్యాలలో భర్త మౌనపోరాటం

నా భార్య నాక్కావాలి అంటూ..తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో ఓ భర్త మౌనపోరాటం చేస్తున్నాడు. తన భార్య..ను అత్తామామలే మార్చేశారని, కౌన్సెలింగ్ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నాడు. తనకు న్యాయం జరిగేంత వరకు…భార్య ఇంటి ముందు పోరాటం చేస్తానని అంటున్నాడు.

భర్త అన్యాయం చేశాడని..తనకు న్యాయం చేయాలని భార్యలు పోరాటం చేస్తున్న ఘటనలు చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. భార్య తనను వద్దని అనుకొంటోందని..తనకు భార్య కావాలని కోరుతున్నాడు.



మంచిర్యాల జిల్లాలోని లేఖ శ్రీ..కరీంనగర్ జిల్లాలోని ఇల్లంతకుంట ప్రాంతానికి చెందిన రామ్ కరణ్ లు పెద్దలను ఎదిరించి 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్ని రోజులు సంసారం సజావుగానే సాగింది. అనంతరం ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు రావడంతో ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి.

దీంతో జన్మభూమినగర్ లో ఉన్న తల్లిదండ్రుల వద్దకు లేఖ వెళ్లిపోయింది. కానీ తాము విడిపోవడానికి లేఖ తల్లి దండ్రులే కారణమని ఆరోపిస్తున్నాడు రామ్ కరణ్. తమ గొడవ విడాకుల వరకు వెళ్లిందని, తన భార్యకు కౌన్సెలింగ్ ఇప్పించాలని కోరుతున్నాడు. అధికారులు స్పందించాలంటూ భార్య ఇంటి ఎదుట బైఠాయించాడు.



న్యాయం జరిగేంత వరకు ఇక్కడే కూర్చొంటానని భీష్మించుకూర్చొన్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని భార్య, భర్తలకు కౌన్సెలింగ్ ఇప్పించేందుకు సిద్ధమయ్యారు. మరి వీరి వైవాహిక జీవితంలో చోటు చేసుకున్న ఘటనలు పరిష్కారమౌతాయా ? భర్త వెంట లేఖ వెళుతుందా ? లేదా ? అనేది చూడాలి.