రోమాలు నిక్కబొడిచేలా.. భారతీయ సైనికులు జమ్మూకశ్మీర్‌లో జెండాను ఎత్తిన వేళ..

  • Published By: sreehari ,Published On : August 15, 2020 / 10:15 PM IST
రోమాలు నిక్కబొడిచేలా.. భారతీయ సైనికులు జమ్మూకశ్మీర్‌లో జెండాను ఎత్తిన వేళ..

కరోనా కారణంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కాస్తా నిశబ్ధంగా జరిగాయి… బండిపోరా జిల్లాలోని జమ్మూ కాశ్మీర్ గురేజ్‌లోని మంచు పర్వతంపైన జాతీయ జెండాను ఎత్తి ఆగస్టు 15న గుర్తుగా ఉన్న సైనికుల వీడియోను భారత సైన్యం శనివారం షేర్ చేసింది.. ఈ వీడియోను చూస్తుంటే ప్రతి భారతీయుడిలో రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి..



ఈ వీడియోలో జెండా ఎత్తిన తరువాత.. జాతీయ గీతం వాయిద్య వెర్షన్ వినిపిస్తుంది.. నియంత్రణ రేఖపై కుడివైపు 12,500 నుంచి 13,000 అడుగుల మధ్య జెండాను ఎత్తినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. భారతదేశపు 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని శనివారం జరుపుకుంది. కరోనావైరస్ మహమ్మారి మధ్య వేడుకలు జరిగాయి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఈ రోజు ఉదయం ఎర్రకోట నుండి ఎగరవేసి.. తన ఏడవ ప్రసంగం ఇచ్చారు.. సామాజిక దూరం భద్రతా చర్యలతో కొనసాగాయి. సాయుధ దళాలను ప్రశంసించారు.



లడఖ్‌లోని గాల్వన్ వ్యాలీలో జూన్‌లో చైనాతో జరిగిన ఘర్షణ గురించి ప్రధాని మోడీ ఇలా అన్నారు… భారతదేశం సమగ్రత మాకు అత్యున్నతమైనది. మన జవాన్లు ఏమి చేయగలరు, దేశం ఏమి చేయగలరు, ప్రపంచం లడఖ్‌లో చూసింది. ఈ రోజు నేను అందరికీ వందనం చేస్తున్నానని అన్నారు.. జూన్ 15న చైనా దళాలతో జరిగిన ఘర్షణలో 20 మంది సైనికులు దేశం కోసం అమరులయ్యారు.