#IND vs NZ: ఆట‌లో ఇలాంటి ఓట‌మి స‌హ‌జ‌మే: వాషింగ్ట‌న్ సుంద‌ర్

టీమిండియా, న్యూజిలాండ్ మధ్య నిన్న రాంచీలో జ‌రిగిన తొలి టీ20 మ్యాచులో టీమిండియా ఆట‌గాడు వాషింగ్ట‌న్ సుంద‌ర్ బంతుల్లో 50 ప‌రుగులు చేసిన‌ప్ప‌టికీ భార‌త్ ఓడిపోయింది. టీమిండియా ఓట‌మిపై వాషింగ్ట‌న్ సుంద‌ర్ స్పందించాడు. ఏదో ఒక‌రోజు ఎవ‌రికైనా స‌రే ఇటువంటి ఓట‌మి ఎదుర‌వుతుంద‌ని, ఇటీవ‌ల రాయ్ పూర్ లో జ‌రిగిన వ‌న్డేలోనూ న్యూజిలాండ్ కు ఇలాంటి ఓట‌మి ఎదురైంద‌ని చెప్పాడు. రాయ్ పూర్ లో జ‌రిగిన రెండో వ‌న్డేలో న్యూజిలాండ్ 34.3 ఓవ‌ర్ల‌లో 108 ప‌రుగుల‌కే ఆలౌటైన విష‌యం తెలిసిందే.

#IND vs NZ: టీమిండియా, న్యూజిలాండ్ మధ్య నిన్న రాంచీలో జ‌రిగిన తొలి టీ20 మ్యాచులో టీమిండియా ఆట‌గాడు వాషింగ్ట‌న్ సుంద‌ర్ బంతుల్లో 50 ప‌రుగులు చేసిన‌ప్ప‌టికీ భార‌త్ ఓడిపోయింది. టీమిండియా ఓట‌మిపై వాషింగ్ట‌న్ సుంద‌ర్ స్పందించాడు. ఏదో ఒక‌రోజు ఎవ‌రికైనా స‌రే ఇటువంటి ఓట‌మి ఎదుర‌వుతుంద‌ని, ఇటీవ‌ల రాయ్ పూర్ లో జ‌రిగిన వ‌న్డేలోనూ న్యూజిలాండ్ కు ఇలాంటి ఓట‌మి ఎదురైంద‌ని చెప్పాడు. రాయ్ పూర్ లో జ‌రిగిన రెండో వ‌న్డేలో న్యూజిలాండ్ 34.3 ఓవ‌ర్ల‌లో 108 ప‌రుగుల‌కే ఆలౌటైన విష‌యం తెలిసిందే.

కాగా, నిన్న‌టి మ్యాచులో టీమిండియా త‌న స్థాయికి త‌గ్గ రాణించ‌లేక‌పోయింద‌ని, భార‌త్ త‌దుప‌రి మ్యాచుల్లో తిరిగి రాణిస్తుంద‌ని వాషింగ్ట‌న్ సుంద‌ర్ చెప్పాడు. నిన్న‌టి మ్యాచులో కేవ‌లం స్పిన్నింగ్ మాయ‌జాలం బాగా ప‌నిచేసింద‌ని తాను భావించ‌డం లేద‌ని తెలిపాడు. మైదానంలో అన్నింటినీ ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని చెప్పాడు.

మొద‌ట్లో తాము బాగా ఆడితే ఫ‌లితం మ‌రోలా ఉండేద‌ని తెలిపాడు. నిన్న ఎదుర్కొన్న స్పిన్ బౌలింగ్ వంటి బాల్స్ ను భార‌త ఆట‌గాళ్లు ఐపీఎల్ లోనూ ఎదుర్కొన్నార‌ని చెప్పాడు. తాము ఓపిక‌తో ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నాడు. ఆట‌లో ఎలాంటి ప‌రిణామాలైనా ఎదురు కావ‌చ్చ‌ని చెప్పాడు.

ఆట‌లో రెండు జ‌ట్లూ గెలిచే అవ‌కాశం ఉండ‌ద‌ని, అలాగే, 22 మంది ఆట‌గాళ్లూ ఒకే ఆట‌లో రాణించే అవ‌కాశ‌మూ ఉండ‌ద‌ని అన్నాడు. కాగా, భార‌త్ ముందు న్యూజిలాండ్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించ‌లేద‌న్న విష‌యం తెలిసిందే. టీమిండియా 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లకు 155 పరుగులు చేయగలిగింది.

YS Viveka Murder Case : సీబీఐ విచారణకు వెళ్తూ .. వైఎస్ విజయలక్ష్మితో వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి భేటీ

ట్రెండింగ్ వార్తలు