Suryakumar Yadav: నా పొరపాటు వల్లే వాషింగ్టన్ సుందర్ ఔట్ అయ్యాడు: సూర్య
'ఇది చాలా సవాలుతో కూడుకున్న వికెట్. వాషింగ్టన్ సుందర్ ఔట్ అయిన సమయంలో మ్యాచును చివరి వరకు తీసుకెళ్లే బ్యాట్స్ మన్ అవసరం. వాషింగ్టన్ సుందర్ నా పొరపాటు వల్లే రనౌట్ అయ్యాడు. బంతిని గమనించకుండా పరుగు కోసం ప్రయత్నించాను. మ్యాచులో బ్యాటింగ్ లో టీమిండియాకు ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని మేము అనుకోలేదు. మ్యాచులో పరిస్థితికి తగ్గ నేను మారడం చాలా ముఖ్యం. వాషింగ్టన్ సుందర్ ఔట్ అయ్యాక వచ్చిన హార్దిక్ పాండ్యా చివర్లో నాలో ఆత్మవిశ్వాసం నింపాడు' అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.

Suryakumar Yadav: నిన్నటి మ్యాచులో తన పొరపాటు వల్లే వాషింగ్టన్ సుందర్ కీలక సమయంలో ఔట్ అయ్యాడని టీమిండియా బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ అన్నాడు. న్యూజిలాండ్ తో నిన్న జరిగిన రెండో టీ20 మ్యాచులో స్వల్ప లక్ష్య ఛేదన (100 పరుగులు) కోసం భారత్ కష్టపడాల్సి వచ్చింది. సూర్యకుమార్ యాదవ్ క్రీజులో నిలదొక్కుకుని 31 బంతుల్లో 26 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో టీమిండియా గెలిచింది.
దీంతో మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. మైదానంలో దూకుడుగా ఆడే సూర్య నిన్నటి మ్యాచులో మాత్రం తన బ్యాటింగ్ స్టైల్ కి భిన్నంగా ఆడాల్సి వచ్చింది. ఈ మ్యాచుపై సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ”ఇది నాలోని విభిన్న వర్షన్. మ్యాచులో నెలకొన్న అటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా నేను ఆడడం చాలా ముఖ్యం. క్లిష్టపరిస్థితులు నెలకొన్న సమయంలో బ్యాటింగ్ కు దిగాను.
ఇది చాలా సవాలుతో కూడుకున్న వికెట్. వాషింగ్టన్ సుందర్ ఔట్ అయిన సమయంలో మ్యాచును చివరి వరకు తీసుకెళ్లే బ్యాట్స్ మన్ అవసరం. వాషింగ్టన్ సుందర్ నా పొరపాటు వల్లే రనౌట్ అయ్యాడు. బంతిని గమనించకుండా పరుగు కోసం ప్రయత్నించాను.
మ్యాచులో బ్యాటింగ్ లో టీమిండియాకు ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని మేము అనుకోలేదు. మ్యాచులో పరిస్థితికి తగ్గ నేను మారడం చాలా ముఖ్యం. వాషింగ్టన్ సుందర్ ఔట్ అయ్యాక వచ్చిన హార్దిక్ పాండ్యా చివర్లో నాలో ఆత్మవిశ్వాసం నింపాడు” అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.
Imran Khan: అన్ని పార్లమెంట్ స్థానాల్లో ఒకే ఒక్కడు.. 33 స్థానాల్లో పోటీ చేయనున్న ఇమ్రాన్ ఖాన్