Jamia Masjid: జామియా మసీదులో ఫొటోలు తీసుకోవడం, పరిసరాల్లో అబ్బాయిలు-అమ్మాయిలు కలిసి కూర్చోవడంపై నిషేధం

మసీదుకు వచ్చే వారు దాని పవిత్రతను గౌరవించాలని కోరుతున్నట్లు శ్రీనగర్ లోని జామియా మసీదు నిర్వాహకులు చెప్పారు. వినోదభరితమైన సౌకర్యాలు ఉండడానికి ఇదేం పబ్లిక్ పార్క్ కాదని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఫొటోలు తీసుకోవడం వంటి పనులు చేయకూడదని కోరారు.

Jamia Masjid: జామియా మసీదులో ఫొటోలు తీసుకోవడం, పరిసరాల్లో అబ్బాయిలు-అమ్మాయిలు కలిసి కూర్చోవడంపై నిషేధం

Jamia Masjid

Jamia Masjid: జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ జామియా మసీదులో ఫొటోలు తీసుకోవడం, మసీదు పరిసరాల్లో అబ్బాయిలు-అమ్మాయిలు కలిసి కూర్చోవడంపై నిషేధం విధించారు. అలాగే, ఫొటోలు తీసుకునేందుకు వాడే ఏ ఎలక్ట్రానిక్ పరికరాన్నీ మసీదులోకి తీసుకురాకుండా నిబంధనలు విధించారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు శ్రీనగర్ జామియా మసీదు నిర్వాహకులు తెలిపారు.

‘‘మసీదులో ఏ రకమైన ఫొటోలనూ తీసుకోవడానికి వీలు లేకుండా నిషేధం విధిస్తున్నాం. అంతేకాదు, ఫొటోలు తీసుకునేందుకు వాడే ఏ పరికరాన్నీ తీసుకురావడానికి వీల్లేదు. అలాగే, తినుభండారాలను కూడా మసీదు ప్రాంగణంలోకి తీసుకురావద్దు. లంచ్ తో పాటు ఇతర ఆహార పదార్థాలను తీసుకువచ్చే వారికి ప్రవేశం ఉండదు. అటువంటి వారిని గేటు వద్దే ఆపేస్తాం’’ అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

మసీదుకు వచ్చే వారు దాని పవిత్రతను గౌరవించాలని కోరుతున్నట్లు చెప్పారు. వినోదభరితమైన సౌకర్యాలు ఉండడానికి ఇదేం పబ్లిక్ పార్క్ కాదని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఫొటోలు తీసుకోవడం వంటి పనులు చేయకూడదని కోరారు.

Viral Video: అంధులైన తల్లిదండ్రులకు తన కళ్లతో లోకాన్ని చూపిస్తున్న చిన్నారి