Viral Video: ఖతర్‌లో ఫిఫా ప్రపంచకప్.. కేరళలో రోడ్డుపై కొట్టుకున్న బ్రెజిల్, అర్జెంటీనా ఫ్యాన్స్

ఘర్షణకు దిగిన వారు బ్రెజిల్, అర్జెంటినా జాతీయ జెండాలను పట్టుకుని ఉన్నారు. కొందరు జెర్సీలు ధరించారు. బ్రెజిల్, అర్జెంటినా జట్ల అభిమానులు కేరళలోని కొళ్లాం, శక్తికులంగార గ్రామీణ ప్రాంతంలో ఓ ప్రాంతం వద్దకు చేరుకుని కర్రలతో కొట్టుకుంటూ, పిడిగుద్దులు కురిపించుకుంటూ బీభత్సం సృష్టించారు.

Viral Video: ఖతర్‌లో ఫిఫా ప్రపంచకప్.. కేరళలో రోడ్డుపై కొట్టుకున్న బ్రెజిల్, అర్జెంటీనా ఫ్యాన్స్

Viral Video: ఖతర్‌లో ఫిఫా ప్రపంచకప్ జరుగుతున్న వేళ కేరళలో బ్రెజిల్, అర్జెంటీనా జట్ల అభిమానులు పరస్పరం ఘర్షణకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో ఆ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఘర్షణకు దిగిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఘర్షణకు దిగిన వారు బ్రెజిల్, అర్జెంటినా జాతీయ జెండాలను పట్టుకుని ఉన్నారు. కొందరు జెర్సీలు ధరించారు. బ్రెజిల్, అర్జెంటినా జట్ల అభిమానులు కేరళలోని కొళ్లాం, శక్తికులంగార గ్రామీణ ప్రాంతంలో ర్యాలీ తీస్తూ ఓ ప్రాంతం వద్దకు చేరుకున్నాక కర్రలతో కొట్టుకుంటూ, పిడిగుద్దులు కురిపించుకుంటూ బీభత్సం సృష్టించారు. ఘర్షణకు దిగిన వారిని స్థానికులు శాంతిపజేశారు.

ఆ తర్వాత అక్కడ నుంచి అందరూ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుందని పోలీసులు గుర్తించారు. వీడియోను పరిశీలిస్తున్నామని, నిందితులను గుర్తిస్తామని చెప్పారు. కాగా, ఫిఫా ప్రపంచ కప్ రెండు రోజుల క్రితమే ప్రారంభమైంది. నిన్న ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచులో ఇరాన్ ఓడిపోయింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..