Viral Video: కింగ్ ఫిషర్ పక్షిని కాపాడిన యువకుడు.. స్వేచ్ఛగా ఎగిరిపోయిన పక్షి

ఓ సరస్సు వద్ద ఇనుప గిల్స్ పై ఓ కింగ్ ఫిషర్ వచ్చి వాలింది. అది చాలాసేపు అలాగే ఉండిపోవడంతో మంచుతో దాన్ని కాళ్లు గిల్స్ కు అంటుకుపోయాయి. అది అక్కడి నుంచి ఎగిరి వెళ్లిపోవాలని ఎంతగా ప్రయత్నించినా దాని వల్ల కాలేదు. ఈ విషయాన్ని గుర్తించిన ఓ వ్యక్తి దాని వద్దకు వెళ్లాడు. దాన్ని కాపాడాడు.

Viral Video: కింగ్ ఫిషర్ పక్షిని కాపాడిన యువకుడు.. స్వేచ్ఛగా ఎగిరిపోయిన పక్షి

Viral Video

Viral Video: పక్షులంటే చాలా ఇష్టం కనబర్చుతుంటారు కొందరు. పక్షులకు ఆహారం వేయడమే కాదు.. అవి ఆపదలో ఉన్నా వాటిని ఆదుకుంటారు. ఇటువంటి ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. తాజాగా, కింగ్ ఫిషర్ పక్షిని రక్షించాడు ఓ వ్యక్తి. ఉష్ణోగ్రతలు భారీగా తగ్గడంతో పలు ప్రాంతాల్లో మంచు కనపడుతోంది.

ఇనుప వస్తువులపై కూడా మంచు కనపడుతోంది. ఓ సరస్సు వద్ద ఇనుప గిల్స్ పై ఓ కింగ్ ఫిషర్ వచ్చి వాలింది. అది చాలాసేపు అలాగే ఉండిపోవడంతో మంచుతో దాన్ని కాళ్లు గిల్స్ కు అంటుకుపోయాయి. అది అక్కడి నుంచి ఎగిరి వెళ్లిపోవాలని ఎంతగా ప్రయత్నించినా దాని వల్ల కాలేదు. ఈ విషయాన్ని గుర్తించిన ఓ వ్యక్తి దాని వద్దకు వెళ్లాడు.

దాని కాళ్లు గిల్స్ కు అంటుకుపోయి ఉన్నట్లు గుర్తించాడు. దాని కాళ్లకు హాని కలగకుండా రాసి, గిల్స్ నుంచి దాన్ని వేరు చేశాడు. అనంతరం ఆ పక్షిని వదిలేశాడు. దీంతో ఆ కింగ్ ఫిషర్ పక్షి ఎంచక్కా ఎగురుకుంటూ వెళ్లిపోయింది. ఈ దృశ్యాలన్నింటినీ ఓ వ్యక్తి కెమెరాలో బంధించాడు. పక్షిని కాపాడిన వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Khushbu : వారసుడు సినిమా నుంచి ఆ నటి సీన్స్ ని తొలిగించారా? లేదా నటినే మార్చేశారా??