SP Balasubrahmanyam Health Update: సోమవారం శుభవార్త వినబోతున్నాం.. ఎస్పీ చరణ్..

  • Published By: sekhar ,Published On : September 3, 2020 / 06:18 PM IST
SP Balasubrahmanyam Health Update: సోమవారం శుభవార్త వినబోతున్నాం.. ఎస్పీ చరణ్..

SPB Health Update: ప్రపంచవ్యాప్తంగా గాన గంధర్వుడు ఎస్.పి. బాలు కోసం అభిమానులు, సంగీత కళాకారులు చేసిన పూజలు ఫలించాయి. ప్రస్తుతం బాలు కోలుకుంటున్నారు. కోవిడ్-19తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నబాలు ఆరోగ్యం ప్రస్తుతం మరింత మెరుగ్గా ఉందని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తాజాగా ప్రకటించారు.

ఈ మేరకు గురువారం ట్విట్టర్‌లో స్పందించిన చరణ్‌..వరుసగా నాలుగో రోజు తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన నిదానంగా కోలుకుంటున్నారని తెలిపారు. దేవుని ఆశీర్వాదంతో సోమవారం ఓ శుభవార్త వినబోతున్నారని చరణ్ పేర్కొన్నారు. దీంతో ఎస్పీ బాలు ఆరోగ్యం పూర్తిగా కుదుట పడిందని, సోమవారం డిశ్చార్జ్ కాబోతున్నారని సినీ వర్గాలవారు, బాలు అభిమానులు ఆశిస్తున్నారు.