#Mars2020 : ఈ రాత్రి 11 గంటల తర్వాత ఆకాశంలో అద్భుతం.. డోంట్ మిస్..!

  • Published By: sreehari ,Published On : September 6, 2020 / 04:53 PM IST
#Mars2020 : ఈ రాత్రి 11 గంటల తర్వాత ఆకాశంలో అద్భుతం.. డోంట్ మిస్..!

#Mars2020- Mars-Moon conjunction : ఈ రాత్రి ఆకాశంలో ఓ అద్భుతం జరుగబోతోంది. సరిగ్గా 11 గంటల తర్వాత అంగారకుడు, చంద్రుడు ఒకే చోట పక్కపక్కనే కనిపించనున్నాయి. ఈసారి అంగారకుడిని గుర్తించడం పెద్ద సమస్యే కాదు.. సెప్టెంబర్ (ఆదివారం) రాత్రి 11 గంటల తర్వాత ఈ అద్భుత దృశ్యం కనిపించనుందని Astronomer Dean Regas తెలిపారు.



ఒక డిగ్రీ తక్కువ దూరంలో అంగారకుడు, చంద్రుడు ఆకాశంలో కనువిందు చేయనున్నారు. తూర్పున రాత్రి 10.15 గంటల నుంచి ఈ రెండు ప్రకాశవంతగా కనిపిస్తాయి.. అలా రాత్రి 11 గంటల తర్వాత పక్కపక్కనే దర్శనమిస్తాయి.



ఆగస్టు 9న కూడా మార్స్, చంద్రులు మరింత దగ్గరగా వచ్చాయి. ఈ నెలలో మరింత దగ్గరగా రానున్నాయని నాసా తెలిపింది. ఈ అద్భుత దృశ్యాన్ని బైనాక్యులర్లతో చూస్తే.. చంద్రుడు, అంగారకుడు ఒకే చోట కనిపిస్తాయని నాసా పేర్కొంది.


అంగారక గ్రహం ముందుగా చంద్రునిపైనా కనిపిస్తుంది.. ఆ తర్వాత చంద్రుని కుడివైపుకు మారడాన్ని చూడొచ్చు.. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల తర్వాత పొగమంచు కనిపిస్తుందని Forecasters తెలిపారు. ఆ తర్వాత ఒక గంట తర్వాత ఈ దృశ్యం అదృశ్యమైపోతుందని చెప్పారు.