Viral Video: ముందు చక్రాలే లేని ట్యాంకర్.. అయినా వేగంగా నడిపిన డ్రైవర్.. వీడియో చూస్తే షాకే!

అప్పటికే ప్రమాదానికి గురైన ఒక ట్యాంకర్‌కు ముందు చక్రాలు ఊడిపోయాయి. మిడిల్ వీల్స్, బ్యాక్ వీల్స్ మాత్రమే ఉన్నాయి. సాధారణంగా ముందు చక్రాలు లేకుండా నడిపితే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కానీ, ట్యాంకర్ డ్రైవర్ మాత్రం.. అప్పటికే ప్రమాదానికి గురైంది..

Viral Video: ఏదైనా ట్రక్కు లేదా ట్యాంకర్ నడవాలంటే ముందు భాగంలో కచ్చితంగా చక్రాలు ఉండి తీరాలి. అలా లేకుంటే నపడటం సాధ్యం కాదు. కానీ, ఒక ట్యాంకర్ డ్రైవర్ మాత్రం ముందు టైర్లు లేకుండానే ట్యాంకర్ ట్రక్కును నడిపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రకారం.. అప్పటికే ప్రమాదానికి గురైన ఒక ట్యాంకర్‌కు ముందు చక్రాలు ఊడిపోయాయి.

Mid-Day Meals: మధ్యాహ్న భోజనంలో నాన్ వెజ్.. వారానికోసారి చికెన్, గుడ్లు, పండ్లు ఇవ్వనున్న బెంగాల్ ప్రభుత్వం

మిడిల్ వీల్స్, బ్యాక్ వీల్స్ మాత్రమే ఉన్నాయి. సాధారణంగా ముందు చక్రాలు లేకుండా నడిపితే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కానీ, ట్యాంకర్ డ్రైవర్ మాత్రం.. అప్పటికే ప్రమాదానికి గురైంది.. ఇక ఏం పర్లేదు అనుకున్నాడో ఏంటో! ఆ ట్రక్కును అలాగే నడుపుకొంటూ వెళ్లాడు. రోడ్డుపై అతి వేగంగా, ముందు టైర్లు లేకుండా వెళ్తున్న ఈ వాహనాన్ని కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. హెవీ లోడ్స్ తీసుకెళ్లే వాహనాలు, మూడు వరుసలుగా చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ వీల్స్, మిడిల్ వీల్స్, బ్యాక్ వీల్స్. అయితే, ముందు చక్రాలు లేకుండానే ట్రక్కు నడపడంపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇలాంటివి మన దేశంలోనే సాధ్యం అంటూ కామెంట్ చేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు