Chatbot: యువకుడిని తీవ్ర అసహనానికి గురిచేసిన బ్యాంకు చాట్‌బాట్.. దాని సమాధానాలు చూస్తే మైండ్ బ్లాక్

మళ్లీ హలో అని టైప్ చేశాడు. అతడికి తిరిగి హలో అనే సమాధానమే వచ్చింది. ఇలా పలుసార్లు జరిగింది.

Chatbot: యువకుడిని తీవ్ర అసహనానికి గురిచేసిన బ్యాంకు చాట్‌బాట్.. దాని సమాధానాలు చూస్తే మైండ్ బ్లాక్

Chatbot

Chatbot – Bank : ఖాతాదారులు విసుగు చెందకుండా, ఇబ్బందులు పడకుండా వారికి ఇంటి నుంచే సేవలు, సలహాలు, సూచనలు అందించడానికి బ్యాంకులు చాట్‌బాట్లు తీసుకొచ్చాయి. ఆన్‌లైన్లో మనం మన సమస్య చెబితే అందుకు పరిష్కారాన్ని చూపిస్తాయి చాట్‌బాట్లు.

బ్యాంకులకు వెళ్లే అవసరం లేకుండా బాగా ఉపయోగపడతాయి. అయితే, ఒక్కోసారి అవి ఖాతాదారులు మరింత విసుగు చెందేలా చేస్తున్నాయి. ఇటువంటి అనుభవాన్నే ఎదుర్కొన్నాడు ఓ వ్యక్తి. తనకు ఎదురైన అనుభవానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను ఆ కస్టమర్ పోస్ట్ చేశాడు.

తన బ్యాంకు సపోర్ట్ బాట్ ఎలాంటి సమాధానాలు ఇచ్చిందో చెప్పాడు. బ్యాంకుకు సంబంధించిన మనిషితో మాట్లాడాలంటే మొదట సపోర్ట్ బాట్ లో సమస్య చెప్పాల్సిందేనని, అదేమో ఇటువంటి సమాధానాలు ఇస్తోందని అన్నాడు. మొదట ఆ ఖాతాదారుడు చాట్‌బాట్ లో హలో అని టైప్ చేశాడు. దీంతో అతడిని హలో అనే సమాధానం వచ్చింది.

chatbot

chatbot

మళ్లీ హలో అని టైప్ చేశాడు. అతడికి తిరిగి హలో అనే సమాధానమే వచ్చింది. ఇలా పలుసార్లు జరిగింది. తన క్రెడిట్ కార్డు వార్షిక ఫీజు రూ.1,651 ఎందుకు ఉందని, తాను రెండు రోజుల క్రితమే ఆ కార్డు తీసుకున్నానని ఆ ఖాతాదారుడు టైప్ చేశాడు. ఆ ప్రశ్నకు కూడా చాట్‌బాట్ హలో అంటూ సమాధానం ఇచ్చింది. అతడు హలో చెప్పి మళ్లీ ప్రశ్న అడిగాడు. చాట్‌బాట్ మళ్లీ హలోనే చెప్పడం గమనార్హం.

Secunderabad : నిమిషాల్లో జబ్బు మాయం చేస్తానన్నాడు, కట్ చేస్తే ఘరానా మోసం