MAA Elections: మా.. ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు విజయం

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల కౌంటింగ్ ఫలితాల్లో స్పష్టత వస్తోంది. ప్రెసిడెంట్ గా.. ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించినట్టు వార్తలు అందుతున్నాయి.

MAA Elections: మా.. ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు విజయం

Vishnu

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల కౌంటింగ్ ఫలితాల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘన విజయం సాధింటాకు. ముందు నుంచీ చెబుతున్నట్టుగానే.. ప్రకాష్ రాజ్ పై విజయాన్ని సొంతం చేసుకున్నారు. వందకు పైగా ఓట్ల.. స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు.

ప్రకాష్ రాజ్ ప్యానెల్ తో.. మంచు విష్ణు ప్యానెల్ హోరాహోరీగా తలపడింది. చివరికి.. ప్రెసిడెంట్ స్థానాన్ని విష్ణు దక్కించుకోగా… ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెట్, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ పదవులను మాత్రం ప్రకాష్ రాజ్ ప్యానెల్ దక్కించుకుంది.