Food Orders From Dad’s Phone: మొబైల్ నుంచి రూ.80 వేల విలువైన ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన ఆరేళ్ల బాలుడు.. తండ్రి షాక్
చిన్న పిల్లలు కూడా మొబైల్ ఫోన్లకు అలవాటు పడుతున్న రోజులివి. వాటితోనే ఆటలు, అందులోనే పాఠాలు, స్నేహితులతో చాటింగులు. తాజాగా, ఓ బాలుడు స్మార్ట్ ఫోన్ పట్టుకుని బెడ్ పై కూర్చుకున్నాడు. అతడు మొబైల్ గేమ్స్ ఆడుకుంటున్నాడేమోనని ఆ బాలుడి తండ్రి భావించాడు. అయితే, ఆ బాలుడు ఫుడ్ డెలివరీ యాప్ లో తెలిసీతెలియక ఏకంగా దాదాపు రూ.80 వేల ఆహార పదార్థాల ఆర్డర్ ఇచ్చాడు.

Food Orders From Dad’s Phone: చిన్న పిల్లలు కూడా మొబైల్ ఫోన్లకు అలవాటు పడుతున్న రోజులివి. వాటితోనే ఆటలు, అందులోనే పాఠాలు, స్నేహితులతో చాటింగులు. తాజాగా, ఓ బాలుడు స్మార్ట్ ఫోన్ పట్టుకుని బెడ్ పై కూర్చుకున్నాడు. అతడు మొబైల్ గేమ్స్ ఆడుకుంటున్నాడేమోనని ఆ బాలుడి తండ్రి భావించాడు. అయితే, ఆ బాలుడు ఫుడ్ డెలివరీ యాప్ లో తెలిసీతెలియక ఏకంగా దాదాపు రూ.80 వేల ఆహార పదార్థాల ఆర్డర్ ఇచ్చాడు.
ఒక ఆహార పదార్థం తర్వాత మరొకటి ఇలా ఇంటికి వరుసగా వస్తుండడంతో ఆ తండ్రి షాక్ అయ్యాడు. తన బ్యాంకు ఖాతా నుంచి రూ.80 వేలు కట్ అయినట్లు తెలుసుకున్నాడు. తన స్మార్ట్ ఫోన్ తీసుకుని చూశాక ఆ తండ్రికి అసలు విషయం తెలిసింది. అమెరికాలోని మెట్రో డెట్రాయిట్, చెస్టర్ఫీల్డ్ టౌన్ షిప్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గ్రుభబ్ ఫుడ్ డెలివరీ యాప్ లో తన కుమారుడు రూ.80 వేల విలువచేసే ఫుడ్ ఆర్డర్ చేశాడని, టిప్ గా ప్రతి ఆర్డర్ కి ఫుడ్ రేటులో 25 శాతం కూడా ఇచ్చాడని బాలుడి తండ్రి కీత్ స్టోన్ హౌస్ తాజాగా ఓ మీడియాకు తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. చికెన్, శాండ్ విచ్ వంటి పదార్థాలు ఒక్కొక్కటిగా డెలివరీ బాయ్స్ తీసుకురావడం చూసి ఆశ్చర్యపోయానని తెలిపాడు. ఇదొక స్కిట్ లా జరిగిపోయిందని తెలిపాడు. తన కుమారుడి వయసు ఆరేళ్లని వివరించాడు.
Pakistan Economy: కీలక నిర్ణయాలు తీసుకోనున్న పాక్.. అఖిలపక్ష సమావేశానికి ఇమ్రాన్ కూ ఆహ్వానం