SPB అంత్యక్రియలు..చెన్నైకి వెళ్లిన మంత్రి అనీల్ కుమార్

  • Published By: madhu ,Published On : September 26, 2020 / 09:27 AM IST
SPB అంత్యక్రియలు..చెన్నైకి వెళ్లిన మంత్రి అనీల్ కుమార్

#SPBalasubrahmanyam : ప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం (SPB) అంత్యక్రియలు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆయన ఎంతో ఇష్టంగా భావించే తిరువళ్లూరు జిల్లా రెడ్ హిల్స్ సమీపంలోని తామరైపాకంలోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు జరుగనున్నాయి.


చాలా ఇష్టపడి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 17 ఎకరాల స్థలంలో ఫామ్ హౌస్ కొనుగోలు చేశారు. విశ్రాంతి తీసుకొనేందుకు వ్యవసాయక్షేత్రం వచ్చే వారని అంటున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ..అంత్యక్రియలు జరుగనున్నాయి.


తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. అత్యంత సన్నిహితుల మధ్య ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఎంజీఎం హాస్పిటల్ నుంచి కోడంబాకంలోని ఎస్పీ చరణ్ ఇంటికి అభిమానుల సందర్శనార్థం బాలు పార్థీవదేహాన్ని తరలించారు. తండోపతండాలుగా జనాలు తరలివచ్చారు. కానీ..ఎవరినీ పోలీసులు అనుమతించడం లేదు.

ఇదిలా ఉంటే..ఏపీ ప్రభుత్వ తరపున మంత్రి అనీల్ కుమార్ యాదవ్ అంత్యక్రియలకు హాజరయ్యారు. శనివారం ఉదయం చెన్నైకి వచ్చారు. బాలు పార్థివదేహానికి ఘనంగా నివాళులర్పించి..కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


ఈ సందర్భంగా 10tv ఆయనతో మాట్లాడింది. నెల్లూరు సిటీలో బాలు జన్మించారని, ఎంతో మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన మన మధ్య లేకపోయినా..ఆయన పాటలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. బాల సుబ్రమణ్యం గుర్తు పెట్టుకొనేందుకు చిహ్నం ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.


ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గాయకుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన బాలు మరణంతో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది.