నేను పొరపాటు చేశాను క్షమించండి..డాక్టర్ మాధవీలత సూసైడ్ నోట్

  • Published By: murthy ,Published On : August 28, 2020 / 12:22 PM IST
నేను పొరపాటు చేశాను క్షమించండి..డాక్టర్ మాధవీలత సూసైడ్ నోట్

కర్నూలు జిల్లా నంద్యాల లో ఆగస్టు 16 న సూసైడ్ చేసుకున్న ప్రముఖ డెంటిస్ట్ మాధవీలత కేసులో పోలీసులు సూసైడ్ నోట్ లోని వివరాలు బయట పెట్టారు. 20 ఏళ్లక్రితం కులాంతర వివాహం చేసుకున్న ప్రేమ జంట ఎంతో అన్యోన్యంగా ఇన్నాళ్లు కాపురం చేశారు. ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేని దంత వైద్యురాలు మాధవీలత ఆగస్టు 16న ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.



విచారణలో భాగంగా పోలీసులు ఆమె రాసిన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆమె… “నన్ను క్షమించండి అని భర్త లక్ష్మణ్ కిశోర్ ను ఉద్దేశించి రాశారు. నేను ఒక పొరపాటు చేశాను. నీతో బాధ్యతగా మెలగలేక పోయాను. నీ మీద ప్రేమ తోనే ఈ ఆత్మహత్య చేసుకుంటున్నాను. కొడుకును బాగా చూసుకో. నువ్వు మరో పెళ్లి చేసుకో… నేను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నానని ఎవరైనా అడిగితే ఓ వ్యాధితో బాధపడుతున్నానని చెప్పు ” అని సూసైడ్ నోట్ లో రాసినట్లు పోలీసులు తెలిపారు. సూసైడ్ నోట్ ను నంద్యాల రెండో పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
https://10tv.in/creative-farmers-flowing-corn-seeds-with-the-help-of-a-bike-anand-mahindra-shared-a-unique-video/
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన లక్ష్మణ్ కిశోర్ , గుంటూరుకు చెందిన మాధవీలత మెడిసిన్ చదివే సమయంలో ప్రేమించుకున్నారు. కులాలు వేరైనా 20 ఏళ్లక్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం నంద్యాలలో శ్రీనివాస్ సెంటర్ లో స్వంతంగా శ్రీరమణ కాస్మోటిక్ డెంటల్ ఆసుపత్రిని నడుపుతున్నారు.



నంద్యాలలోని భరతమాత ఆలయం వద్ద ఇల్లుకొనుగోలు చేసి అక్కడే నివాసం ఉంటున్నారు. భార్యా భర్తలిద్దరూ డెంటర్ డాక్టర్లే. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు మెడిసిన్ చదువుతున్నాడు. ఆగస్టు 16న మాధవీలత తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవని మృతురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.