బాలీవుడ్ కూసాలు కదుతున్నాయ్!

10TV Telugu News

Bollywood drugs case: రకుల్ చెప్తే ..క్షితిజ్ రవిని పట్టుకున్నారు. మరి క్షితిజ్ రవి ఎవరి పేరు చెప్పబోతున్నాడు. కరణ్ జోహార్‌కి నోటీసులు తప్పవా? దమ్ మారో దమ్ వీడియో పార్టీనే కరణ్ జోహార్ కొంప ముంచబోతోందా?

బిటౌన్‌లో వణుకు పుట్టిస్తోన్న డ్రగ్స్ కేసులో దర్శకనిర్మాత కరణ్ జోహార్‌కి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నోటీసులు ఎప్పుడు పంపనుంది. ఇదే ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్. కొన్నేళ్లక్రితం తన నివాసంలో ఇచ్చిన ఓ లేట్‌నైట్ పార్టీలో డ్రగ్స్ విచ్చలవిడిగా పారాయాంటూ తాజాగా కంప్లైంట్ అందింది.

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి ఈ విషయంపై శిరోమణి అకాలీదళ్ లీడర్ మంజిందర్ సింగ్ సిర్సా కంప్లైంట్ ఇవ్వడంతో, ఎన్‌సిబి ఆ వీడియోని ఫోరెన్సిక్ ఆడిటింగ్‌కి పంపింది..

ఈ వీడియోలో బాలీవుడ్‌లోని ప్రముఖ నటీనటులు మత్తులో జోగడం కన్పించింది. ఒకరిపై ఒకరు వాలిపోతూ వంటిపై స్పృహ ఉందో లేదో అన్పించే రేంజ్‌లో ఊగిపోతూ కన్పించారు. ఇందులో నిజంగా వీళ్లంతా డ్రగ్స్ తీసుకున్నారా? మద్యం తీసుకున్నారా అనేది తేల్చాలంటే ఎంక్వైరీ జరగాల్సిందే. దీంతో కరణ్ జోహార్‌ని ఎన్‌సిబి
రాడార్‌లో బిగిస్తుందా అనే సందేహాలు. మొదలయ్యాయ్. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ధర్మ ప్రొడక్షన్స్‌కి చెందిన క్షితిజ్ రవి ప్రసాద్‌ని అరెస్ట్ చేసింది

నార్కోటిక్స్ ఎంక్వైరీకి వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ తాను డ్రగ్స్ కోసం చాట్ చేసినట్లు ఒప్పుకుందని ప్రచారం సాగుతోంది. ఐతే తానెలాంటి డ్రగ్స్ తీసుకోలేదని మెలిక పెట్టిందంటున్నారు. ఐతే రకుల్ ప్రీత్ సింగ్ విచారణ సందర్భంగానే క్షితిజ్ రవి ప్రసాద్ పేరు బైటికి వచ్చిందంటున్నారు.

ఎవరీ క్షితిజ్ రవి ప్రసాద్?
క్షితిజ్ రవి ప్రసాద్ ధర్మా ప్రొడక్షన్స్‌లో అంటే కరణ్ జోహార్ నిర్మాణ సంస్థలోనే పని చేస్తున్నాడు. కరణ్ జోహార్ అసలు క్షితిజ్ రవి ప్రసాద్‌తో తనకి సంబంధం లేదంటూ చెప్పడం విడ్డూరం.

కరణ్ జోహార్ ఈ స్కూప్‌ నుంచి బైటపడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదనే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు బైట సర్క్యులేట్ అవుతోన్న బర్త్ డే పార్టీ మాత్రమే కాదు, ఇలాంటి ఎన్నో పార్టీలు కేజో ఇస్తుంటాడని, వాటిలో విచ్చలవిడిగా మత్తు పదార్ధాలు వాడతారని కంగనారనౌత్ లాంటి వాళ్లు ఇప్పటికే చాలాసార్లు విరుచుకపడ్డారు.

డ్రగ్స్ కేసులో లింకులను లాగుతోన్న నార్కోటిక్స్ బ్యూరో కరణ్ జోహార్ ప్రకటనలను నమ్మదని పక్కా ఆధారాలతో సిద్ధమైన తర్వాత నోటీసులు పంపిన తర్వాత అదుపులోకి తీసుకుంటుంది.. ఇప్పటికే ఈ కేసులో పదహారు మందిని అరెస్ట్ చేసిన నార్కోటిక్స్ అధికారులు, తన రాడార్‌లో 150మందిని పెట్టిందని తెలియడంతో బాలీవుడ్ కూసాలు కదిలిపోతాయనే ప్రచారం జరుగుతోంది.