Nepal Plane Crash : నేపాల్ విమాన ప్రమాదంలో గుండెలు పిండే మరో విషాదం.. టిక్ టాక్ వీడియో చేసిన కాసేపటికే దుర్మరణం

Nepal Plane Crash : నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. విమానం కుప్పకూలిన ఘటనలో 72మంది మరణించారు. ఈ ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనలో గుండెలు పిండే మరో విషాదం వెలుగుచూసింది. టిక్ టాక్ వీడియో చేసిన కాసేపటికే ఆమె మరణించింది.

కుప్పకూలిన విమానం సిబ్బందిలో ఒక ఎయిర్ హోస్టెస్ కూడా ఉంది. ఆ ఎయిర్ హోస్టెస్ కు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విమాన ప్రమాదానికి ముందు ఆమె టిక్ టాక్ వీడియో తీసుకుంది. ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.

Also Read..Nepal Plane Crash Incident : నేపాల్ విమాన ప్ర‌మాద ఘటన.. ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేసిన‌ భార‌త ప్ర‌యాణికుడు

కాగా, ఇదే తన చివరి ప్రయాణం అని తెలియని ఎయిర్ హోస్టెస్ ఒసిన్.. విమానంలోకి ప్రయాణికులు ఎవరూ రాక ముందు సెల్ఫీ వీడియో తీసుకుంది. అందులో నవ్వుతూ ఎంతో ఆనందంగా కనిపించింది. కానీ, ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 68 ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది మృతి చెందారు.

ఎయిర్ హోస్టెస్ ఎంతో ఆనందంగా కనిపించింది. ఈ క్రమంలో టిక్ టాక్ వీడియో చేసింది. ప్రముఖ బాలీవుడ్ పాట పెహలా నషా పెహలా కుమార్ మ్యూజిక్ ను బ్యాక్ గ్రౌండ్ లో యాడ్ చేసింది. ఆ వీడియోలో నవ్వులు చిందిస్తూ కనిపించింది ఎయిర్ హోస్టెస్. ప్రయాణికులు ప్లేన్ లోకి ఎక్కకముందు ఆమె ఈ వీడియో తీసుకుంది.

కానీ, ఆమెకు తెలియదు. అదే తన చివరి వీడియో అవుతుందని. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందరినీ కంటతడి పెట్టిస్తోంది. గుండెలను మెలిపెడుతోంది. ఎయిర్ హోస్టెస్ చివరి వీడియో చూసి నెటిజన్లు కన్నీటిపర్యంతం అవుతున్నారు. జీవితం చాలా చిన్నది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. మరణం ఎప్పుడు సంభవిస్తుందో చెప్పలేము.

Also Read..Nepal Plane Crash: ఒకప్పటి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విమానమే.. నేపాల్‌లో ప్రమాదానికి గురైన విమానం ..

అందుకే బతికినన్ని రోజులు ఈ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. మరికొందరు.. రెస్ట్ ఇన్ పీస్ అని కామెంట్ చేశారు.కాగా, ఎయిర్ హోస్టెస్ ఒసిన్ నేపాల్ లో ప్రముఖ టిక్ టాకర్ గా గుర్తింపు పొందింది. ఆమె ఎన్నో టిక్ టాక్ వీడియోలు చేసింది.

నేపాల్ లో ఆదివారం(జనవరి 15) ఘోర విమాన ప్రమాదం జరిగింది. పొఖారా ఎయిర్ పోర్టు సమీపంలోకి చేరుకున్న ఫ్లైట్.. కాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా ప్రమాదానికి గురై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది.. మొత్తం 72 మంది ప్రాణాలు కోల్పోయారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

విమానం కూలడంతో అలర్ట్ అయిన అధికారులు ప్రయాణికులను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ప్రయాణికులంతా సజీవ దహనమయ్యారు. ల్యాండింగ్ సమయంలో కంట్రోల్ తప్పిన విమానం నేలవైపు దూసుకొచ్చి క్రాష్ అయ్యింది.

ట్రెండింగ్ వార్తలు