North Korea: శతఘ్ని గుళ్లతో ఉత్తర కొరియా 90 రౌండ్ల కాల్పులు.. మరోసారి తీవ్ర ఉద్రిక్తత

దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు చేస్తుండడంతో ఆ దేశం వైపునకు ఉత్తర కొరియా శతఘ్ని గుళ్లతో 90 రౌండ్ల కాల్పులు జరిపి కలకలం రేపింది. దక్షిణ కొరియా జలాల్లోకి వరుసగా ఉత్తర కొరియా రెండో రోజు కాల్పులు జరపడంతో ఇరు దేశాల మధ్య మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్టోబరు 24న కూడా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా వివాదాస్పద పశ్చిమ సముద్ర ప్రాంతం వద్ద పరస్పరం హెచ్చరికలు చేస్తూ కాల్పులు జరుపుకుని కలకలం రేపిన విషయం తెలిసిందే.

North Korea: శతఘ్ని గుళ్లతో ఉత్తర కొరియా 90 రౌండ్ల కాల్పులు.. మరోసారి తీవ్ర ఉద్రిక్తత

North Korea

North Korea: దక్షిణ కొరియా సైనిక విన్యాసాలు చేస్తుండడంతో ఆ దేశం వైపునకు ఉత్తర కొరియా శతఘ్ని గుళ్లతో 90 రౌండ్ల కాల్పులు జరిపి కలకలం రేపింది. దక్షిణ కొరియా జలాల్లోకి వరుసగా ఉత్తర కొరియా రెండో రోజు కాల్పులు జరపడంతో ఇరు దేశాల మధ్య మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్టోబరు 24న కూడా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా వివాదాస్పద పశ్చిమ సముద్ర ప్రాంతం వద్ద పరస్పరం హెచ్చరికలు చేస్తూ కాల్పులు జరుపుకుని కలకలం రేపిన విషయం తెలిసిందే.

ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. తాజాగా, ఉత్తర కొరియా జరిపిన కాల్పులపై దక్షిణ కొరియా సైనిక అధికారులు స్పందించారు. ఉత్తర కొరియా శతఘ్ని గుళ్లతో 90 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తాము గుర్తించినట్లు చెప్పారు. కోసాంగ్ తూర్పు తీర ప్రాంతంలోకి, అలాగే, కుమ్ కాంగ్ పట్టణం వైపునకు ఉత్తర కొరియా కాల్పులు జరిపినట్లు వివరించారు.

ఉత్తర కొరియా నిన్న కూడా శతఘ్ని గుళ్లతో 90 రౌండ్ల కాల్పులు జరిపింది. కొరియా ద్వీపకల్పంలో స్థిరత్వం కోసం 2018లో ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. దాన్ని ఉల్లంఘించించేలా ఉత్తర కొరియా కాల్పులు జరిపిందని దక్షిణ కొరియా ఆరోపిస్తోంది. దక్షిణ కొరియా చర్యలపై హెచ్చరిక చేయడానికే తాము కాల్పులు జరుపుతున్నట్లు ఉత్తర కొరియా చెబుతోంది.

ప్రస్తుతం దక్షిణ కొరియా ఆర్మీ చెయోర్వాన్ ప్రాంతంలో బహుళ రాకెట్ లాంచ్ వ్యవస్థలతో కాల్పులు జరుపుతూ విన్యాసాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా ప్రతిస్పందిస్తోంది. ఇటీవల ఉత్తర కొరియా వరుసగా క్షిపణి పరీక్షలు చేసిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా, దక్షిణ కొరియా మరింత అప్రమత్తమయ్యాయి.

North Korea Kim : దక్షిణ కొరియా సినిమాలు చూసినందుకు..ఉత్తర కొరియాలో ఇద్దరు స్కూల్ విద్యార్ధులకు మరణశిక్ష