TSPSC Group 4 Recruitment : తెలంగాణలో గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ ! దరఖాస్తులు ఎప్పటినుంచంటే?

వివిధ శాఖల్లో ఉన్న మొత్తం 9168 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 25 ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ , జూనియర్ ఆడిటర్, వార్డు ఆఫీసర్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి.

TSPSC Group 4 Recruitment : తెలంగాణలో గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ ! దరఖాస్తులు ఎప్పటినుంచంటే?

TSPSC Group 4 Recruitment : తెలంగాణా ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ శాఖల్లో ఉన్న మొత్తం 9168 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 25 ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ , జూనియర్ ఆడిటర్, వార్డు ఆఫీసర్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి.

శాఖలవారిగా పోస్టులను పరిశీలిస్తే పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో 2,701పోస్టులు, రెవిన్యూ శాఖలో 2077పోస్టులు, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలో 1245 పోస్టులు, అగ్రికల్చర్ , కోఆపరేటివ్ శాఖలో 44 పోస్టులు, పశుసంవర్ధక శాఖ, డైరీ డెవలప్ మెంట్ లో 2, బీసీ వెల్ఫేర్ శాఖలో 307, రెవిన్యూ శాఖలో 2,077, ఎస్సీ వెల్ఫేర్ లో 474 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. అలాగే లేబర్ డిపార్ట్మెంట్ లో 128 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ లో 221 పోస్టులు, హోమ్ శాఖలో 133 పోస్టులు, పాఠశాల విద్యాశాఖలో 97 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు.

అభ్యర్ధులు ఈ నెల 23 నుండి జనవరి 12వ తేది వరకు అయా పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పరీక్షను 2023 మే లో నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in పరిశీలించగలరు.